
విచిత్రకర రీతిలో..
రవిబిష్ణోయ్ వేసిన 7.1 ఓవర్ గూగ్లీ బంతికి స్లిప్‌లో జేసన్ హోల్డర్ చేతికి చిక్కాడు. అయితే, అంతకుముందే ఆ బంతి వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ షూకు తగిలి నేరుగా వెళ్లి హోల్డర్ చేతుల్లో పడింది. దీంతో అంపైర్ ఔటివ్వకుండా అతను పెవిలియన్‌కు వెళ్లడం కనిపించింది. తర్వాత అంపైర్ ఆగమని చెప్పాక.. ఔటయ్యాడో, కాదోనని నిర్ధారించుకున్నాక వెళ్లిపోయాడు. ఈ మ్యాచ్‌లో దుష్మంత చమీరా వేసిన ఓ షార్ట్‌పిచ్ బంతి.. ఇషాన్ హెల్మెట్‌ను తాకింది. ఇంతకుముందు కూడా పలుమార్లు షార్ట్‌పిచ్ బంతులకు ఇబ్బందిపడ్డాడు. ఈ నేపథ్యంలో అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కామెంటేటర్‌గా ఇషాన్ వైఫల్యంపై స్పందించిన గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

క్రీజులో ఉండాలనుకోలేదు..
బ్యాటింగ్ చేయడానికి తెగ ఇబ్బంది పడిన ఇషాన్ కిషన్ క్రీజును వీడేందుకు ఉత్సాహం కనబర్చాడని విమర్శించాడు. అంపైర్ తుది నిర్ణయం వెల్లడించకుండానే ఔటని భావించి మైదానం వీడేందుకు ప్రయత్నించాడని తెలిపాడు. 'ఇషాన్ ఈ మ్యాచ్‌లో బాగా ఇబ్బందిపడ్డాడు. అసలు క్రీజులో ఉండాలనుకోలేదు. సహజంగా ఎవరికైనా బంతి ఎడ్జ్ తీసుకొని వెళ్లి ఫస్ట్‌స్లిప్‌లో చిక్కితే ఆ బ్యాట్స్‌మన్ కచ్చితంగా ఔటో కాదో తెలుసుకునేంత వరకు వేచిచూస్తారు. ఇక్కడ ఇషాన్ అలా కనిపించలేదు. బంతి హోల్డర్ చేతుల్లో పడగానే పెవిలియన్ బాట పట్టాడు. ఆ బంతి నేలను కూడా తాకే అవకాశం ఉంది. అంపైర్ పిలిచేదాకా.. దాన్ని నిర్ధారించుకోకుండానే పెవిలియన్‌కు బయల్దేరాడు. అది అతని మానసికస్థితి తెలియజేస్తోంది.

పిల్లాడు కూడా వణికిస్తాడు..
చమీరా వేసిన బంతి హెల్మెట్‌కు తాకడంతో ఇషాన్ భయపడ్డానుకుంటా. గతంలో కూడా అతనికి బంతి హెల్మెట్‌ను తాకిన సందర్భాలు ఉన్నాయి. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇలా ఆడితే ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాల్లోని బౌన్సీ పిచ్‌లపై ఇంకా ఇబ్బందులు పడతాడు. ప్రతి ఒక్క పేసర్ అతనికి షార్ట్‌పిచ్ బంతులే వేస్తారు. అతనికి కావాల్సిన విధంగా బౌలింగ్ చేయరు. నడుముపైకొచ్చే బంతుల్ని ఇప్పుడు అస్సలు ఆడలేకపోతున్నాడు. అప్పుడు బంతులన్నీ అతడి మీదకే సంధిస్తారు' అని సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు.

ఇషాన్ కిషన్ వల్లే..
ముంబై ఇండియన్స్ వరుస పరాజయాలకు ప్రధాన కారణం ఇషాన్ కిషనే కారణమని నెటిజన్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అతని కోసం వేలం రూ.15.25 కోట్లు ఖర్చు పెట్టి ముంబై మేనేజ్‌మెంట్ ఘోర తప్పిదం చేసిందని, అతనికి బదులు ఇతర ఆటగాళ్లను తీసుకుంటే పరిస్థితి వేరేలా ఉండేదని కామెంట్ చేస్తున్నారు. సీజన్ ఆరంభంలో రాణించిన ఇషాన్ ఆ తర్వాత దారుణంగా విఫలమయ్యాడు. 8 మ్యాచ్‌ల్లో 28.43 సగటుతో 199 రన్స్ మాత్రమే చేసాడు. అతని వైఫల్యం రోహిత్ శర్మ బ్యాటింగ్‌పై ప్రభావం చూపింది.


Click it and Unblock the Notifications












