చనిపోయే రెండు నిమిషాల ముందు ఆ సిక్సర్‌ను చూస్తా: భారత క్రికెట్ దిగ్గజం

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆగస్టు 15 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ఇచ్చి యావత్ క్రీడాలోకాన్ని షాక్‌కు గురిచేశాడు. మహీ వీడ్కోలు పలికి ఐదు రోజులు అయినా ప్రతీఒక్కరూ అతడు టీమిండియాకు చేసిన సేవల్ని, సాధించిన విజయాల గురించి ఇంకా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ధోనీ అనూహ్య రిటైర్‌మైంట్‌తో దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ భావోద్వానికి లోనయ్యారు. టీమిండియాకు ధోనీ చేసిన సేవ గురించి సన్నీ గుర్తుచేసుకున్నారు.

అభిమానులు మర్చిపోకూడదు:
తాజాగా ఇండియా టుడేతో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీ మంచి బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్. అంతకుమించి గొప్ప కెప్టెన్. టీమిండియాకు ఎంతో సేవ చేశాడు. ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. క్లిష్ట సమయాల్లోను కూల్‌గా వ్యవహరించి దేశానికి ఎన్నో కప్‌లు అందించాడు. అతడి సేవలను భారత అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా 2011లో ప్రపంచకప్ ఫైనల్‌లో మహీ ప్రత్యేక సిక్సర్‌తో కప్ అందించిన క్షణాన్ని క్రికెట్ అభిమానులు మర్చిపోకూడదు' అని అన్నారు.

ఆ సిక్సర్‌ను చూసే చనిపోతా:
'కొన్ని రోజుల క్రితం ఐపీఎల్ ప్రారంభమైంది. చెన్నై సూపర్ కింగ్స్ వారి మొదటి మ్యాచ్ ఆడుతుంది. నేను మైదానంలో ఉన్నాను. అప్పుడు ఎంఎస్ ధోనీని కలుసుకున్నా. ఆ సమయంలో మహీకి ఓ విషయం చెప్పా. "నేను ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్లే కొన్ని నిమిషాల ముందు.. 2011లో ప్రపంచకప్ ఫైనల్‌లో మహీ కొట్టిన ప్రత్యేక సిక్సర్ పెట్టమని అడుగుతా. ఆ సిక్సర్ చూసిన తర్వాత చనిపోతా. ఆ సిక్సర్‌ను చూసి చనిపోతే ఎంతో సంతోషిస్తా" అని ధోనీతో అన్నా. అప్పడు మహీ ఏమి మాట్లాడలేదు. నవ్వుతూ కనిపించాడు' అని సునీల్ గవాస్కర్ తెలిపారు.

కపిల్ కంటే మహీనే ఎక్కువ:
'కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీలకు దగ్గరి పోలికలు ఉన్నాయి. ఇద్దరూ జట్టుకు విజయాలను అందించాలని కోరుకుంటారు. ఇద్దరూ ఆటను ఎంతో ఇష్టపడతారు. ఆల్ టైమ్ ఇండియా ఎలెవన్ కెప్టెన్ జాబితాలో కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీలు ముందువరసలో ఉంటారు. మిగతావారు చాలా మంచి ప్రదర్శనలు కనబరిచారు, ద్వైపాక్షిక సిరీస్ గెలిచారు. కానీ ప్రపంచకప్‌లు గెలిచింది మాత్రం ఈ ఇద్దరే. కపిల్ కంటే మహీనే ముందువరసలో ఉంటాడు. ఎందుకంటే వన్డే ప్రపంచకప్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌ను కూడా సాధించాడు' అని భారత క్రికెట్ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చారు.

టెస్టుల్లో 10,122 పరుగులు:
భారత్ తరఫున 127 టెస్టులాడిన సునీల్ గవాస్కర్ 51.12 సగటుతో 10,122 పరుగులు చేశారు. ఇందులో 34 సెంచరీలు, ఉన్నాయి. టెస్టుల్లో 4 డబుల్ సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు సన్నీ బాదారు. టెస్టు క్రికెట్‌లో 10వేల పరుగులు మైలురాయిని అందుకున్న ఫస్ట్ క్రికెటర్‌గా ఆయన అరుదైన ఘనతని సొంతం చేసుకున్నారు. టెస్టుల్లో తనదైన ముద్ర వేసిన సన్నీ.. వన్డేల్లో మాత్రం ఆశించిన మేర రాణించలేకపోయారు. 108 వన్డేలాడిన గవాస్కర్ 35.14 సగటుతో 3,092 పరుగులు చేశారు. ఇందులో ఒక్క సెంచరీ మాత్రమే ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
'డ్రీమ్ 11' కేవలం ఈ ఒక్క ఏడాదికే.. తేల్చేసిన బీసీసీఐ!!