
డ్రీమ్ 11 ఇక అధికారికం:
'ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్ 11ను ఐపీఎల్ పాలక మండలి ప్రకటించింది. డ్రీమ్ 11 (స్పోర్టా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్) భారతీయ కంపెనీ. ప్రధాన కేంద్రం ముంబైలో ఉంది' అని బీసీసీఐ ఓ ప్రకటన జారీ చేసింది. ఈ ఏడాది ఐపీఎల్ 13వ సీజన్ టైటిల్ స్పాన్సర్‌షిప్ కోసం రూ.222కోట్లకు బిడ్ వేసి హక్కులను దక్కించుకున్న డ్రీమ్ 11 తదుపరి రెండేండ్లకు కూడా తమకే ఇవ్వాలని ప్రతిపాదించిందని సమాచారం. దీన్ని బీసీసీఐ తిరస్కరించిందని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.

ఈ ఒక్క ఏడాదికే:
'ఐపీఎల్ 2020 కోసం డ్రీమ్ 11 అత్యధిక మొత్తానికి బిడ్ వేసింది. కానీ వచ్చే రెండేళ్లలో రూ.240 కోట్లకే టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను ఇచ్చేందుకు అంగీకరించం. వచ్చే ఏడాదికల్లా కరోనా పరిస్థితులు అప్పటికల్లా కుదురుకుంటాయి. వివోతో ఒప్పందం ఉంకా ఉంది. ప్రస్తుతం నిలిచిపోయింది. ఒకవేళ రూ.440 కోట్లు వస్తుంటే.. రూ.240కోట్లకేఎందుకు ఇవ్వాలి' అని సదరు బీసీసీఐ అధికారి చెప్పారు.

సరిహద్దు వివాదం:
సరిహద్దు వివాదం కారణంగా 'చైనా వస్తు బహిష్కరణ' ఉద్యమం బలంగా ఉండటంతో.. ఈ ఏడాది టైటిల్ స్పాన్సర్‌గా ఉండలేమని 'వివో' మొబైల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ, ఫ్రాంచైజీలు కలిసి రూ.444 కోట్లు నష్టపోయాయి. దానిని పూడ్చుకొనేందుకు బిడ్డింగులు ఆహ్వానించగా.. బైజుస్ (రూ.201 కోట్లు), అన్‌అకాడమీ (రూ.170 కోట్లు), డ్రీమ్ 11 (రూ.222 కోట్లు) పోటీపడ్డాయి. చివరికి అత్యధిక మొత్తం వేసిన డ్రీమ్ 11కే టైటిల్ స్పాన్సర్ హక్కులు దక్కాయి. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈలో ఐపీఎల్ జరుగుతుంది.

దొడ్డి దారిన హక్కులు సరైంది కాదు:
ఒక వైపు చైనా కంపెనీలతో సంబంధాలు తెంచుకోవాలంటూ, మరో వైపు 'డ్రీమ్ 11'తో బీసీసీఐ ఒప్పందం చేసుకోవడాన్ని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్ (సీఏఐటీ) ప్రశ్నించింది. చైనా పెట్టుబడులు ఉన్న కంపెనీకే ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ హక్కులు ఇవ్వడం తమను బాధించిందని అభిప్రాయపడింది. ఈ మేరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి సీఏఐటీ లేఖ రాసింది. 'డ్రీమ్ 11లో చైనాకు చెందిన టెన్సెంట్ కంపెనీ ప్రధాన వాటాదారుగా ఉంది. చైనాను తీవ్రంగా వ్యతిరేకించే భారత అభిమానుల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఇలా దొడ్డి దారిన హక్కులు కేటాయించడం సరైంది కాదు. ఇది భారత ప్రయోజనాలను పణంగా పెట్టడమే' అని సీఏఐటీ లేఖలో పేర్కొంది.


Click it and Unblock the Notifications

CPL 2020: హెట్‌మైర్ ఒంటరిపోరాటం.. సీపీఎల్‌లో గయానా బోణీ!!