For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతడే టీమిండియా భవిష్యత్తు సారథి.. ఇందులో ఎలాంటి సందేహం లేదు: గవాస్కర్

Sunil Gavaskar feels Rishabh Pant as Team India captain is one for the future

ముంబై: యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ టీమిండియా భవిష్యత్తు సారథి అనడంలో ఎలాంటి సందేహం లేదని భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను పంత్ చక్కగా ముందుకు నడిపించాడని ఆయన ప్రశంసించారు. జట్టును గెలిపించాలన్న జ్వాల, నేర్చుకొనే తపన అతడిలో కనిపించాయని సన్నీ తెలిపారు. పలు జట్లలో కరోనా కేసులు వెలుగు చూడడంతో బీసీసీఐ టోర్నీని నిరవధిక వాయిదా వేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్-అక్టోబర్ మాసాల్లో మిగిలిన టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తోంది.

కొన్ని తప్పులు చేశాడు

కొన్ని తప్పులు చేశాడు

తాజాగా సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'యువ రిషబ్ పంత్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిలబడింది. ప్రతిసారీ నాయకత్వం గురించి ప్రశ్నించే సరికి ఆరో మ్యాచుకే అతడు విసిగిపోవడం మనం చూడొచ్చు. ఎందుకంటే.. ప్రతి మ్యాచ్‌ తర్వాత అతడిని ఇదే ప్రశ్న అడుగుతున్నారు. చూసొచ్చేందుకు అనుమతిస్తే కాల్చొచ్చేందుకు సిద్దంగా ఉంటానన్న జ్వాలను పంత్ ప్రదర్శించాడు. అవును, సారథిగా కొన్ని తప్పులు చేశాడు. ఒక మ్యాచులో బౌలర్లను, ఫీల్డర్లను మోహరించడంలో విఫలం అయ్యాడు. అయితే పొరపాట్లు చేయని సారథి ఎవరుంటారు? చెప్పండి' అని ప్రశ్నించారు.

భవిష్యత్తు సారథుల్లో ఒకడు

భవిష్యత్తు సారథుల్లో ఒకడు

'పొరపాట్ల నుంచి నేర్చుకొనే తత్వం రిషబ్ పంత్‌లో కనిపించింది. చాలా సందర్భాల్లో అతడు ప్రత్యర్థి కన్నా ముందున్నాడు. ఒక్కో సమయంలో సీనియర్ సారథిని తలపించాడు. జట్టును నడిపించేందుకు తనవైన దారులు వెతికాడు. పంత్ భవిష్యత్తు సారథుల్లో ఒకడు. అందులో సందేహమే లేదు. ప్రతిభకు అవకాశం వచ్చినప్పుడు.. వినియోగించుకోవడానికి కావాల్సిన టెంపర్‌మెంట్‌ అతడిలో ఉంది. పంత్ మంచి బ్యాట్స్‌మన్‌, సారథిగా ఎదుగుతాడు. ఆ నమ్మకం నాకు ఉంది' భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు. సన్నీ భారత్ తరఫున 125 టెస్టులు, 108 వన్డేలు ఆడారు. టెస్టులో తనదైన ముద్ర వేసిన గవాస్కర్.. వన్డేల్లో మాత్రం ఆశించిన మేర రాణించలేకపోయారు.

Team India Test Squad: 14 రోజుల క్వారంటైన్‌.. ప్రతి క్రికెటర్‌కు ఇంటివద్దే కరోనా టెస్ట్!!

అయ్యర్ దూరమవడంతో

అయ్యర్ దూరమవడంతో

రెగ్యులర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయంతో దూరమవడంతో.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌ను రిషబ్ పంత్‌ నడిపించాడు. అయ్యర్ లేని లోటును అతడు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. 8 మ్యాచుల్లో 6 విజయాలు ఢిల్లీకి అందించాడు. లీగ్ నిలిచేసమయానికి పాయింట్ల పట్టికలో జట్టును అగ్రస్థానంలో నిలిపాడు. అంతేకాకుండా సారథిగా చేసిన పొరపాట్లను సరిదిద్దుకొంటూ నేర్చుకున్నాడు. ఇవన్నీ అందరిని అమితంగా ఆకట్టుకున్నాయి.

తొలిసారి ఫైనల్‌కు

తొలిసారి ఫైనల్‌కు

శ్రేయస్ అయ్యర్‌ సారథ్యంలో గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌ అద్భుతంగా ఆడింది. తొలిసారి ఫైనల్ చేరింది. అయితే పటిష్ట ముంబై ఇండియన్స్ జట్టును ఎదుర్కోలేకపోయింది. లీగ్, ప్లే ఆఫ్ మ్యాచుల్లో చెలరేగిన ఢిల్లీ.. ఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది. అయితే గతేడాది ఫామ్‌ను ఐపీఎల్‌ 2021లోనూ కొనసాగించింది. ఏప్రిల్ 9న ఈ క్యాష్ రిచ్‌ లీగ్‌కు తెరలేవగా.. ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 10న ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా చెన్నై సూపర్​కింగ్స్​తో ఆడింది. మొదటి మ్యాచులోనే అద్భుత విజయాన్ని అందుకుంది.

Story first published: Thursday, May 13, 2021, 12:59 [IST]
Other articles published on May 13, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+