Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sunil Gavaskar: ఇంగ్లండ్ పుంజుకోవాలంటే ఆ దేవుడే దిగిరావాలి!

Sunil Gavaskar feels England need superhuman

న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత్‌తో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ విజయాల బాట పట్టాలంటే అద్భుతం జరగాలని దిగ్గజ క్రికెట్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఇంగ్లండ్ టీమ్ సూపర్ హూమన్‌లా చెలరేగితేనే సిరీస్‌లో నిలుస్తుందని చెప్పుకొచ్చాడు. 'ది టెలిగ్రాఫ్ ఇండియా'దిన పత్రికకు రాసిన కాలమ్‌లో గవాస్కర్ ఈ విషయాలను ప్రస్తావించాడు. లార్డ్స్ టెస్ట్ విజయంతో కోహ్లీ సేన మానసికంగా మరింత బలంగా తయారైందన్నాడు. ఈ క్రమంలోనే ఆతిథ్య జట్టు పుంజుకోవడం కష్టమని లిటిల్ మాస్టర్ అభిప్రాయపడ్డాడు. అయితే క్రికెట్‌లో ఏదైనా జరగొచ్చని, అద్భుతాలు జరిగితే ఒక్కసారిగా పరిస్థితులన్నీ తారుమారు కావొచ్చని తెలిపాడు.

లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టు చివరి రోజు ఉదయం పూట ఇంగ్లండ్‌ గెలుస్తుందని అంతా అనుకున్నారని, కానీ ఐదోరోజు ఆటలో కనీసం 180 పరుగులైనా చేయడం కష్టతరమైందని గవాస్కర్‌ వివరించాడు. ఈ క్రమంలోనే ఆతిథ్య జట్టు 150 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైందన్నాడు. అలాగే ఇంగ్లండ్‌ జట్టులో కెప్టెన్‌ జో రూట్‌ మినహా ఎవరూ బ్యాటింగ్‌ చేయలేరని గుర్తుచేశాడు. అతని మీదే ఆ జట్టు అధికంగా ఆధారపడుతుందని వెల్లడించాడు. దాంతో రూట్‌ను ఔట్‌ చేస్తే ఇంగ్లండ్‌ పని ఖతమైనట్టేనని మాజీ బ్యాట్స్‌మన్‌ పేర్కొన్నాడు. చివరగా బెన్‌స్టోక్స్‌పై స్పందిస్తూ.. తానే ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ అయి ఉంటే ఆటకు దూరంగా ఉన్న అతన్ని తిరిగి జట్టులో కొనసాగమని కోరేవాడినని అన్నాడు. స్టోక్స్‌ అరుదైన క్రికెటర్‌ అని, అలాంటి వ్యక్తి ఆటకు దూరంగా ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నాడు.

లార్డ్స్ టెస్ట్‌లో 151 పరుగులతో ఆతిథ్య జట్టును చిత్తు చేసిన కోహ్లీసేన చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఫలితంగా ఐదు టెస్టుల సిరీసులో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. వర్షం కారణంగా మొదటి టెస్టును డ్రా చేసుకున్న కోహ్లీ సేన రెండో టెస్టులో అద్వితీయమైన విజయం అందుకుంది. బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌ కలిసి రాణించారు. ఆఖరి రోజు భారత పేసర్లు ఆంగ్లేయులను కేవలం 60 ఓవర్లలోపే ఆలౌట్‌ చేసి విజయం అందించడం ప్రత్యేకం. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ లీడ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభం కానుంది.

ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే భారత తుది జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ జట్టులోకి రానున్నాడు. లీడ్స్ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ మార్పు జరగనుంది. అంతేకాకుండా మరో స్పిన్నర్ జడేజా బౌలింగ్ తేలిపోవడంతో అశ్విన్ తుది జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. స్పిన్నర్ల విషయం మినహా.. లీడ్స్‌ టెస్ట్ మ్యాచుకు భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. ఓపెనర్లు రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్ మంచి ఫామ్ మీదున్నారు. విమర్శలపాలైన చతేశ్వర్ పుజారా, అజింక్య రహానేలు కూడా గాడిలో పడ్డారు. ఇక విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. వీరు కూడా పరుగులు చేస్తే.. ఇంగ్లండ్ జట్టుకు తిప్పలుతప్పకపోవచ్చు. పేసర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్ సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Story first published: Sunday, August 22, 2021, 22:10 [IST]
Other articles published on Aug 22, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+