ఈ విషయం తెలుసా?.. టెస్టు, వన్డేలో ఒక్కో వికెట్ తీసిన గవాస్కర్!!

హైదరాబాద్: భారత క్రికెట్ దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగులు సాధించిన తొలి భారత ఆటగాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో టెస్ట్ క్రికెట్లో గొప్ప ఓపెనర్లలో ఒకరుగా నిలిచారు. 1970, 1980లలో భారత బ్యాటింగ్‌లో ప్రధానమైన గవాస్కర్.. సుదీర్ఘ ఫార్మట్ చరిత్రలో తనదైన ముద్ర వేశారు. కరీబియన్ బౌలర్లు సంధించే బంతులకి అప్పట్లో అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లు సైతం బెంబేలెత్తిపోయేవారు. కానీ హెల్మెట్, గాడ్స్ లాంటి సేప్టీలు పెద్దగా లేని రోజుల్లోనే సన్నీ విండీస్ బౌలర్లని ఉతికారేశారు. భారత్ క్రికెటర్లకే కాదు.. ప్రపంచానికి టెస్టుల్లో ఎలా ఆడాలో ఆయన నేర్పించారు.

టెస్టు, వన్డేలో వికెట్ తీసిన గవాస్కర్:
తన బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు నెలకొల్పిన సునీల్ గవాస్కర్.. పలు సందర్భాల్లో బౌలింగ్ కూడా చేశారు. అయితే ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.. ముఖ్యంగా ఇప్పటి క్రికెట్ అభిమానులకు. లిటిల్ మాస్టర్ తన బౌలింగ్‌తో టెస్టుల్లో, వన్డేల్లో ఒక్కో వికెట్ పడగొట్టారు. అది కూడా పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ జహీర్ అబ్బాస్‌నే రెండుసార్లు పెవిలియన్ చేర్చడం ఇక్కడ విశేషం. సన్నీ బౌలింగ్‌లో మరో విశేషం ఏంటంటే.. మీడియం పేస్‌తో పాటు ఆఫ్ స్పిన్ కూడా వేసేవారు. కుడిచేతితో బౌలింగ్ చేసే గవాస్కర్ మొత్తం 29 ఇన్నింగ్స్‌ల్లో 380 బంతులు సంధించారు.

రెండు సార్లు అబ్బాస్ వికెటే:
1978-79 పాకిస్థాన్ పర్యటన సందర్భంగా బిషన్ సింగ్ బేడీ కెప్టెన్సీలో సునీల్ గవాస్కర్ మొదటిసారి బౌలింగ్ చేశారు. ఓ టెస్టు మ్యాచ్‌లో జహీర్ అబ్బాస్ (96) పరుగుల వద్ద ఉండగా.. సన్నీ బౌలింగ్‌లో చేతన్ చౌహాన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. వన్డేల్లోనూ అబ్బాస్ మరోసారి సన్నీకి వికెట్ సమర్పించుకున్నాడు. గవాస్కర్ రెండు సార్లు అబ్బాస్ వికెట్ ఖాతాలో వేసుకోవడం విశేషం. 1987లో అంతర్జాతీయ క్రికెట్‌కి గవాస్కర్ రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రస్తుతం క్రికెట్ కామెంటేర్‌గా గవాస్కర్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సన్నీ తాజాగా 71వ పడిలోకి అడుగుపెట్టారు.

టెస్టుల్లో 10,122 పరుగులు:
భారత్ తరఫున 127 టెస్టులాడిన సునీల్ గవాస్కర్ 51.12 సగటుతో 10,122 పరుగులు చేశారు. ఇందులో 34 సెంచరీలు, ఉన్నాయి. టెస్టుల్లో 4 డబుల్ సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు సన్నీ బాదారు. టెస్టు క్రికెట్‌లో 10వేల పరుగులు మైలురాయిని అందుకున్న ఫస్ట్ క్రికెటర్‌గా ఆయన అరుదైన ఘనతని సొంతం చేసుకున్నారు. టెస్టుల్లో తనదైన ముద్ర వేసిన సన్నీ.. వన్డేల్లో మాత్రం ఆశించిన మేర రాణించలేకపోయారు. 108 వన్డేలాడిన గవాస్కర్ 35.14 సగటుతో 3,092 పరుగులు చేశారు. ఇందులో ఒక్క సెంచరీ మాత్రమే ఉంది.
'ప్రపంచంలోనే ఐపీఎల్ అత్యుత్తమ టీ20 లీగ్.. క్రికెట్ క్యాలెండర్‌లో లీగ్ కచ్చితంగా ఉండాలి'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications