న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ప్రపంచంలోనే ఐపీఎల్ అత్యుత్త‌మ టీ20 లీగ్‌.. క్రికెట్ క్యాలెండ‌ర్‌లో లీగ్‌ కచ్చితంగా ఉండాలి'

Josh Hazlewood says IPL Probably Strongest T20 Competition in The World


సిడ్నీ: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) ప్రపంచంలోనే అత్యుత్త‌మ టీ20 లీగ్‌ అని ఆస్ట్రేలియా పేస‌ర్ జోస్ హ‌జిల్‌వుడ్ పేర్కొన్నాడు. భారత క్రికెట‌ర్ల‌తో పాటు ఇత‌ర దేశాల ఆట‌గాళ్ల‌కూ ఎంతో కీల‌క‌మైన‌ద‌ని చెప్పాడు. ఆస్ట్రేలియా దేశ‌వాళీ క్రికెట్ ఆడ‌టం క‌న్నా.. ఐపీఎల్ ఆడితే అనుభ‌వంతో పాటు ఆదాయం బాగా ఉంటుంద‌ని హ‌జిల్‌వుడ్ వ్యాఖ్యానించాడు. హ‌జిల్‌వుడ్ ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. అంతర్జాతీయ కెరీర్‌లో హ‌జిల్‌వుడ్ ఇప్పటివరకు 51 టెస్టుల్లో, 48 వన్డేల్లో, 7 టీ20 మ్యాచ్‌ల్లో ఆసీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫోతో జోస్ హ‌జిల్‌వుడ్ మాట్లాడుతూ... 'ఐపీఎల్ అనేది పొట్టి క్రికెట్‌లో ప్ర‌పంచ అత్యుత్త‌మ లీగ్‌. అందులో మెరుగైన ప్ర‌త్య‌ర్థులు ఎదుర‌వుతారు. వారితో ఆడితే ఎంతో నేర్చుకోవ‌చ్చు. కఠిన పరిస్థితులలో ఎలా ఆడాలో నేర్పిస్తుంది. ప్రతిఒక్క ఆటగాడి నుంచి ఎదో ఒక విషయం మనకు తెలుస్తుంది. క్రికెట్ క్యాలెండ‌ర్‌లో ఐపీఎల్‌కు కచ్చితంగా స‌మ‌యం ఉండాలి. టీ20 లీగ్‌ల ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు' అని అన్నాడు.

'కరోనా కారణంగా నాలుగు నెలలుగా మైదానంలోకి దిగలేదు. రోజు వ్యాయామం చేసి ఫిట్‌నెస్‌ కాపాడుకున్నా. టెస్ట్ క్రికెట్ కోసం రెండు వారాల వ్యవధిలో తిరిగి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడం చాలా కష్టం. గాడిలో పడడానికి నాకు గరిష్టంగా రెండు మ్యాచులు అవసరమని నేను భావిస్తున్నా' అని హ‌జిల్‌వుడ్ పేర్కొన్నాడు. బయో సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ అందరికి ఓ ఉదాహరణగా నిలుస్తాడన్నాడు. క్రీడలు ముందుకు సాగడానికి అందరూ కఠినమైన మార్గదర్శకాలను పాటించాలన్నాడు.

Josh Hazlewood says IPL Probably Strongest T20 Competition in The World

ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేయడంతో ఈ ఏడాది ఐపీఎల్‌-13వ సీజన్‌కు మార్గం సుగమమైంది. ప్రపంచకప్‌ వాయిదా పడుతుందని ముందుగానే అంచనా వేసిన బీసీసీఐ.. ఐపీఎల్‌ తేదీలు, వేదికను ఖరారు చేసింది. వైరస్‌ కారణంగా నిరవధికంగా వాయిదా వేసిన ఈ ఏడాది సీజన్‌ను సెప్టెంబర్‌ 26 నుంచి నవంబర్‌ 8 వరకు యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే ఫ్రాంఛైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఏ క్షణమైనా ఐపీఎల్‌ తేదీలు, వేదికను బీసీసీఐ అధికారికంగా ప్రకటించొచ్చని సమాచారం. అయితే ఆటగాళ్ల వీసాలు, ప్రయాణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంది.

సెప్టెంబర్‌ 26 నుంచి ఐపీఎల్‌ 2020!!సెప్టెంబర్‌ 26 నుంచి ఐపీఎల్‌ 2020!!

Story first published: Tuesday, July 21, 2020, 11:50 [IST]
Other articles published on Jul 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X