Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చిత్తుగా ఓడినా బుద్ది రాలేదు.. వర్క్‌లోడ్ అంటూ టైంపాస్ చేస్తున్నారు: సునీల్ గవాస్కర్

సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో చిత్తుగా ఓడిన టీమిండియా.. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. నంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. అయితే ఈ సిరీస్ కోసం టీమిండియా సన్నదమవుతున్న తీరును దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు.

ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకుండా వర్క్‌లోడ్ అంటూ కాలాయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం తొలి టెస్ట్‌కు ఇండియా-ఏ జట్టుతో టీమిండియా మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ఆటగాళ్లు గాయపడే ప్రమాదం ఉందని ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌ను చివరి నిమిషంలో రద్దు చేశారు.

Sunil Gavaskar criticises India s decision for cancelling warm-up match before Australia Tests

ఈ నిర్ణయాన్ని సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌కు నెట్ ప్రాక్టీస్‌కు చాలా వ్యత్యాసం ఉందని వివరించాడు. ఓ దినపత్రికకు రాసిన కాలమ్‌లో టీమిండియా సన్నదతపై విమర్శలు గుప్పించాడు. టీమిండియాను 0-3తో క్లీన్ స్వీప్ చేసిన తర్వాత కూడా న్యూజిలాండ్ ఆటగాళ్లు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారని ప్రస్తావించాడు.

'సన్నాహక మ్యాచ్‌ను రద్దు చేయడం బుద్ది తక్కువ నిర్ణయం. మ్యాచ్ ప్రాక్టీస్‌లో బ్యాటర్‌కు లభించే ఫీలింగ్‌ నెట్స్‌లో ఆడితే రాదు. సేనా దేశాల్లో భారత్ ఎప్పుడూ తొలి మ్యాచ్‌ల్లో గెలవలేదు. సరైన ప్రాక్టీస్ లేకనే ఓటమిపాలైంది. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తే బ్యాటర్లు రెండు మూడు సార్లు ఔటైనా బ్యాటింగ్ కొనసాగిస్తారు. ఎలాంటి టెన్షన్.. ఒత్తిడి ఉండదు. ఓ ప్రాపర్ మ్యాచ్ ఆడిన ఫీలింగ్ రాదు.

బౌలర్లకు కూడా సరైన రిథమ్‌ లభించదు. నోబాల్స్ వేస్తున్నామనే ఆందోళన ఉండదు. మ్యాచ్‌లో అయితే ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేస్తున్నాం. సరైన లెంగ్త్ ఏంటిది? అనేది తెలుస్తోంది. కానీ నెట్స్‌లో అది తెలియదు. ప్రతీ మ్యాచ్ మధ్య చాలా గ్యాప్ ఉంది. కాబట్టి కనీసం రెండు రోజుల వామప్ గేమ్ ఆడాలి. ప్రాక్టీస్ మ్యాచ్‌ల వల్ల పరుగులు చేయకుండా ఇబ్బంది పడుతున్న బ్యాటర్లు.. వికెట్లు తీయలేకపోతున్న బౌలర్లు తిరిగి ఫామ్‌‌లోకి రాగలుగుతారు.

ఇక టీమిండియా వర్క్‌లోడ్ విధానం ఏంటో అర్థం కావడం లేదు. న్యూజిలాండ్ జట్లు భారత్‌ను క్లీన్ స్వీప్ చేసిన తర్వాత కూడా ముంబైలో నెట్ ప్రాక్టీస్ చేసింది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత్.. 57 రోజులు ఉండనుంది. ఇందులో ఐదు టెస్ట్‌ల పేరిట 25 రోజులు మాత్రమే మైదానంలో గడుపనుంది. వామప్ మ్యాచ్‌తో కలుపుకొని 27 రోజులు. ప్రతీ మ్యాచ్ ఐదు రోజుల పాటు జరిగే అవకాశం లేదు. మహా అయితే 16 నుంచి 20 రోజులు కూడా మైదానంలో ఉండరు. అయినా వర్క్‌లోడ్ అంటూ ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తారు.'అని గవాస్కర్ విమర్శలు గుప్పించాడు.

Story first published: Monday, November 11, 2024, 22:14 [IST]
Other articles published on Nov 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+