Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాటు నాటుకు ఆస్కార్.. ఎగిరి గంతేసిన గవాస్కర్! (వీడియో)

Sunil Gavaskar congratulates Team RRR for historic Oscar win and shakes a leg to Naatu Naatu

హైదరాబాద్: ఊహించినట్లుగానే దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు లభించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో తొలిసారి భారత మూవీకి ఈ అత్యున్నత పురస్కారం దక్కింది. సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణితో పాటు రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డ్స్‌ను స్వీకరించారు.

ఓ తెలుగు పాటకు ఆస్కార్ దక్కడంతో యావత్ తెలుగు ప్రజానీకం గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఎక్కడ చూసిన ఆర్‌ఆర్‌ఆర్ ఆస్కార్ అవార్డు గురించే వినబడుతోంది. సోషల్ మీడియా వేదికగా నాటు నాటు పాట హోరెత్తిపోతుంది. తెలుగు ప్రజలే కాకుండా యావత్ దేశం.. ఈ సందర్భాన్ని సెలెబ్రేట్ చేసుకుంటుంది.

ఎగిరి గంతేసిన గవాస్కర్..

సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులతో పాటు క్రికెటర్లు 'నాటు నాటు'పాటకు ఆస్కార్ అవార్డు రావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళితో పాటు కీరవాణి, చంద్రబోస్‌ను ప్రశంసిస్తున్నారు. ఆస్కార్ అవార్డు అందుకున్న ట్రిపుల్ ఆర్ మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఎప్పుడూ హుందాగా కనిపించే టీమిండియా దిగ్గజం సునీల్ గవాస్కర్ సైతం.. ఆర్‌ఆర్‌ఆర్‌కు ఆస్కార్ వచ్చిందని తెలిసి ఆనందంతో ఎగిరి గంతేసాడు. ఈ పాటకు కాలు కూడా కదిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా‌లో వైరల్ అయ్యింది.

 అహ్మదాబాద్‌లో...

అహ్మదాబాద్‌లో...

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ ఐదో రోజు ఉదయం.. స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటేటర్స్ నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం గురించి మాట్లాడుతుండగా.. అక్కడికి గవాస్కర్ వచ్చాడు. ట్రిపుల్ ఆర్ మూవీకి ఆస్కార్ రావడం సంతోషంగా ఉందని చెప్పిన సన్నీ.. ఆర్‌ఆర్ఆర్ టీమ్‌కు, సంగీత దర్శకుడు, రచయితకు శుభాకాంక్షలు తెలియజేశాడు.

ఇటీవలే ఆ సినిమా చూశానని, చాలా అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. భారత సినిమా అంతర్జాతీయ వేదికపై మరిన్నీ అవార్డులు గెలిచేందుకు ఇది నాంది కావాలని తెలిపాడు. అనంతరం తెలుగు కామెంటేటర్స్‌తో కలిసి నాటు నాటు పాటకు కాలు కదిపాడు. ఈ వీడియోను స్టార్ స్పోర్ట్స్ తెలుగు తమ అధికారిక ట్విటర్‌లో షేర్ చేసింది.

సచిన్, సెహ్వాగ్ సైతం..

గవాస్కర్‌తో పాటు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, దినేశ్ కార్తీక్‌ తదితరులు సైతం ట్రిపుల్ ఆర్ టీమ్‌ను అభినందించారు. సోషల్ మీడియా వేదికగా రాజమౌళీపై ప్రశంసల జల్లు కురిపించారు. భారత్‌కే చెందిన డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ 'ది ఎలిఫెంట్ విస్పర్స్'‌కు ఆస్కార్ రావడంపై కూడా భారత మాజీ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేశారు. దేశానికి రెండు ఆస్కార్ అవార్డులు దక్కడం చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.

 భారత్‌దే బీజీటీ..

భారత్‌దే బీజీటీ..

అహ్మదాబాద్ టెస్ట్ డ్రా కావడంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2-1తో భారత్ కైవసం అయ్యింది. వరుసగా నాలుగో ట్రోఫీని భారత్‌ గెలిచింది. 2017, 2018-19, 2020-21, 2023 బీజీటీ సిరీస్‌లను భారత్ వరుసగా గెలుచుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 3/0‌తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆస్ట్రేలియా...175/2 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. మ్యాచ్ ఫలితం తేలే పరిస్థితులు లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు డ్రాకు అంగీకరించారు.

Story first published: Monday, March 13, 2023, 18:47 [IST]
Other articles published on Mar 13, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+