Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ ట్రేడింగ్ వివరాలు బయటకు వెల్లడించాలి: సునీల్ గవాస్కర్

ఐపీఎల్ ట్రేడింగ్ వివరాలను బహిర్గతం చేయాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ డిమాండ్ చేశాడు. ఆటగాడిని ఎంత ధరకు ట్రేడ్ చేసుకున్నారనే వివరాలను బయటపెట్టాల్సిందేనని బీసీసీఐకి సూచించాడు. ఆటగాళ్ల ట్రేడింగ్ విషయంలో ఫ్రాంచైజీలు గోప్యత పాటిస్తున్నాయి. ఎంత ధరకు ట్రేడింగ్ జరిగిందనే వివరాలు బీసీసీఐతో పాటు సదరు ప్లేయర్‌కు, రెండు ఫ్రాంచైజీలకు మాత్రమే తెలుస్తోంది. దాంతో ట్రేడింగ్ డీల్స్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా ట్రేడింగ్ సంబంధించి రోజుకో వార్త షికారు చేస్తోంది. సీఎస్‌కే, కేకేఆర్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్స్ జరిపిందని, హార్దిక్ పాండ్యాకు కూడా కోట్ల రూపాయాలు వచ్చాయంటూ వార్తలు వచ్చాయి. హార్దిక్ ట్రేడింగ్ గురించి తాము ఎవరితో సంప్రదింపులు జరపలేదని ముంబై ఇండియన్స్ స్పష్టత ఇచ్చినా.. ఈ వార్తలు ఆగడం లేదు.

Sunil Gavaskar Calls for Full Transparency During High-Profile IPL Trade No finger pointing

ఈ క్రమంలోనే సునీల్ గవాస్కర్.. బీసీసీఐతో పాటు ఫ్రాంచైజీల ముంగిట ఓ కీలక డిమాండ్ పెట్టారు. 'ఒక ఫ్రాంచైజీ నుంచి మరొక జట్టుకు ప్లేయర్లు ట్రేడ్ అవుతున్నారంటూ గత కొద్దీ రోజులుగా మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ట్రేడింగ్ ప్రక్రియకు సంబంధించిన గడువు ముగిసేందుకు ఇంకా చాలా సమయం ఉంది. సదరు ఆటగాడు వేరే ఫ్రాంచైజీకి మారినట్లు అందరికి తెలిసినా.. ఎంత ట్రేడింగ్ జరిగిందనేది మాత్రం నలుగురికే తెలుస్తుంది. ఆటగాడితో పాటు బీసీసీఐ, రెండు ఫ్రాంచైజీల వద్ద మాత్రమే ట్రేడింగ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఫ్రాంచైజీ తన టీమ్ కోసం నిర్ణయించిన మేరకే వేతనాల పరిమితిని పాటించిందా? లేదా నిబంధనలను అతిక్రమించిందా అనేది ఇతరులకు ఎలా తెలుస్తుంది? పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం కోసం ట్రేడింగ్ వివరాలను బయటపెట్టడం ముఖ్యం. ప్రపంచంలోనే ఐపీఎల్ అత్యుత్తమ టీ20 లీగ్. అందుకే ఆర్థిక పరమైన విషయాల్లో లీగ్‌ వైపు ఎవరూ వేలెత్తి చూపేందుకు ఆస్కారం ఇవ్వొద్దు. అందుకోసం ప్రతి విషయాన్ని బయటకు చెప్పడం ఉత్తమం. అప్పుడు ఐపీఎల్ ప్రొఫైల్ ఇంకా బెటర్‌గా మారుతుంది.'అని గవాస్కర్ సూచించారు.

Story first published: Monday, August 17, 2026, 14:53 [IST]
Other articles published on Aug 17, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+