పుజారాను ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయాలి: సునీల్ గవాస్కర్

న్యూఢిల్లీ: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో డబుల్ సెంచరీలతో చెలరేగుతున్న టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారాను అప్‌కమింగ్ ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచిన విషయం తెలిసిందే. కరోనా కేసుల కారణంగా చివరి టెస్టు వాయిదా పడింది. దాన్ని ఇప్పుడు జులై 1 నుంచి 5 వరకు నిర్వహించనున్నారు.

కౌంటీలో దుమ్మురేపుతున్న పుజారా..
మరోవైపు పుజారా గత కొంతకాలంగా టీమిండియా తరఫున విఫలమవడంతో అతనిపై సెలెక్టర్లు వేటు వేసారు. ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు శ్రీలంకతో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్ నుంచి పుజారాను తప్పించారు. అయితే, అదే సమయంలో ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో పాల్గొన్న అతను ససెక్స్ టీమ్ తరఫున అదరగొట్టాడు. దీంతో అతడు మళ్లీ టీమిండియాకు వచ్చే అవకాశాలపై సునీల్ గావస్కర్ స్పందించాడు.

న్యూజిలాండ్ మాదిరే..
'ఇంగ్లండ్‌తో టెస్టు మ్యాచ్‌కు పుజారాను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. గతేడాది వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్ ఇంగ్లండ్‌లో రెండు టెస్టులు ఆడటంతో.. ఆ జట్టు అక్కడి పరిస్థితులకు అలవాటు పడింది. దాంతో ఫైనల్ మ్యాచ్‌లోనూ వర్షం కురవడంతో పరిస్థితులను సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు పుజారా విషయంలోనూ అదే జరుగుతోంది. ఇంగ్లండ్ పరిస్థితులకు అలవాటు పడ్డాడు. అయితే, కౌంటీ క్రికెట్ బౌలింగ్ అటాక్‌కు, టెస్టు క్రికెట్ బౌలింగ్ అటాక్‌కు చాలా తేడా ఉంది. కానీ, ఒక బ్యాట్స్‌మన్ మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు అతన్ని ఎందుకు ఎంపిక చేయకూడదు?' అని ప్రశ్నించాడు.

పుజారాను ఎందుకు ఎంపిక చేయకూడదు?
పుజారా జనవరి వరకూ టీమిండియాలో ఆడాడని, ఇప్పుడు జట్టు నుంచి తొలగించినా ఆ విరామం రెండు మూడేళ్లు ఉండదని గవాస్కర్ అన్నాడు. కేవలం ఆరు, ఏడు నెలలు మాత్రమే జట్టుకు దూరమవుతాడన్నాడు. దాంతో జులైలో ఇంగ్లండ్‌తో ఆడే టెస్టు మ్యాచ్‌కు అతన్ని ఎంపిక చేయాలన్నాడు. పుజారా బ్యాటింగ్ చేసేటప్పుడు తన ఆటతో ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షించడం, గోడలా నిలబడి వికెట్ కాపాడుకోవడం టీమిండియాకు ముఖ్యమని చెప్పాడు. మరోవైపు ప్రస్తుత కౌంటీ క్రికెట్‌లో అతడి స్ట్రైక్‌రేట్ కూడా బాగుందని గవాస్కర్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications