Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యానే.. రాసి పెట్టుకోండి ఇది పక్కా: సునీల్ గవాస్కర్

 Sunil Gavaskar backs Hardik Pandya to lead Team India, says ‘He has got fantastic leadership quality’

అహ్మదాబాద్: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. సమీప భవిష్యత్తులో అతను భారత జట్టు సారథ్య బాధ్యతలు అందుకుంటాడని జోస్యం చెప్పాడు. ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్‌ను గుజరాత్ టైటాన్స్ గెలవడంలో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌‌లో హార్దిక్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో గుజరాత్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్ కైవసం చేసుకుంది. దాంతో అరంగేట్ర సీజన్‌లోనే విజేతగా నిలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది.

 పిచ్చి నిర్ణయమన్నారు..

పిచ్చి నిర్ణయమన్నారు..

వాస్తవానికి ఐపీఎల్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్.. హార్దిక్ పాండ్యాను సారథిగా ఎంచుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. గత రెండేళ్లుగా గాయాలతో సతమతమవుతూ.. ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శనతో పూర్తిగా జట్టుకు దూరమైన హార్దిక్‌ను సారథిగా ఎంచుకోవడం గుజరాత్ టీమ్ పిచ్చిగా అనిపించింది. అంతేకాకుండా కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాకు ఎలాంటి అనుభవం లేదు. ఏ స్థాయి క్రికెట్ టోర్నీల్లోనూ అతను కెప్టెన్సీ చేసింది లేదు. దాంతో గుజరాత్ అనవసరంగా హార్దిక్‌ను కెప్టెన్‌గా ఎంచుకుందనే విమర్శలు వచ్చాయి.

 ఆల్‌రౌండ్ షోతో..

ఆల్‌రౌండ్ షోతో..

కానీ హార్దిక్ పాండ్యా మాత్రం విమర్శకులంతా నోరు మూసుకునేలా తనదైన సారథ్యంతో జట్టును చాంపియన్‌గా నిలబెట్టాడు. టీమిండియా భవిష్యత్తు సారథిగా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. 15 మ్యాచ్‌లు ఆడిన హార్ధిక్‌ 487 పరుగుల తో పాటు, 8 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక రాజస్తాన్‌తో జరిగిన ఫైనల్లో కూడా పాండ్యా మూడు కీలక వికెట్లతో పాటు, 34 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే హార్దిక్ పాండ్యా పెర్షామెన్స్ గురించి స్టార్ స్పోర్ట్స్ చానెల్‌తో మాట్లాడిన సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాలుగు ఓవర్లు వేయగలడా? అనే సందేహాన్ని కూడా హార్దిక్ తీర్చాడని చెప్పాడు.

కెప్టెన్ అవ్వడం ఖాయం..

కెప్టెన్ అవ్వడం ఖాయం..

'హార్ధిక్‌ ఖచ్చితంగా భారత జట్టుకు సారథి అవుతాడు. ఇది నా అంచనా మాత్రమే కాదు. అందరి అంచనా కూడా. ఈ సీజన్‌లో అతను బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించాడు. అయితే ఈ ఏడాది సీజన్‌ ఆరంభానికి ముందు పాండ్యా నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేయగలడా? లేదా? అనే సందేహం ఉండేది. కానీ వాటిని పటాపంచలు చేస్తూ అతను నాలుగో ఓవర్ల పాటు బౌలింగ్ చేసి తన సత్తా ఎంటో చూపించాడు. ఏ ఆటగాడైనా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటే.. సమీప భవిష్యత్తులో భారత జట్టుకు కెప్టెన్‌గా అయ్యే అవకాశం ఉంటుంది.

 హార్థిక్‌కే ఎక్కువ చాన్స్..

హార్థిక్‌కే ఎక్కువ చాన్స్..

అయితే రోహిత్‌ తర్వాత టీమిండియా కెప్టెన్‌ రేసులో పాండ్యా జట్టు పగ్గాలు అందుకుంటాడని చెప్పను కానీ.. అతను సెలెక్టర్లకు మంచి ఆప్షన్ అవుతాడని చెబుతున్నా. అతనితో పాటు ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నారు. హార్దిక్ పాండ్యాకే ఎక్కువ అవకాశం ఉండనుంది.' అని గవాస్కర్‌ పేర్కొన్నాడు.

Story first published: Monday, May 30, 2022, 18:19 [IST]
Other articles published on May 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+