Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అతని వయసు కాకుండా ఆటను చూడండి.. టీమిండియా ఫినిషర్‌ రోల్‌కు సరైనోడు: సునీల్ గవాస్కర్

 Sunil Gavaskar backs Dinesh Karthik to make India comeback, says Don’t look at his age, what he’s producing

ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మ్యాచ్ విన్నర్, టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్‌పై దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో దినేశ్ కార్తీక్ దుమ్మురేపుతున్నాడని, ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తున్నాడని కొనియాడాడు. అతని వయసును కాకుండా ఆడే ఆటను చూసి భారత జట్టులోకి తీసుకోవాలన్నాడు. టీమిండియా ఫినిషర్ రోల్‌కు దినేశ్ కార్తీక్ సరిగ్గా సరిపోతాడని అభిప్రాయపడ్డాడు. మరికొద్దిసేపట్లో(మంగళవారం) లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆర్‌సీబీ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో అధికార బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌ షోలో సునీల్ గవాస్కర్ మాట్లాడాడు.

 ఫినిషర్‌ రోల్‌కు సరైనోడు..

ఫినిషర్‌ రోల్‌కు సరైనోడు..

టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడమే తన లక్ష్యమని ఇటీవల చెప్పిన కార్తీక్ మాటలను ప్రస్తావిస్తూ.. అతనికి అండగా నిలిచాడు.'భారత్ తరఫున టీ20 ప్రపంచకప్ ఆడాలని ఉందని దినేశ్ కార్తీక్ చెప్పాడు. కాబట్టి అతని వయసు కాకుండా ఆట తీరును చూసి జట్టులోకి తీసుకోవాలి. అసాధారణ ప్రదర్శనతో గేమ్ మూమెంటమ్‌నే మార్చేస్తున్నాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. టీమిండియాలో కూడా నంబర్ 6, 7 ప్లేస్‌లో ఫినిషర్‌గా అందరి అంచనాలను అందుకోగలడు'అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

అజేయ ఇన్నింగ్స్‌లతో..

అజేయ ఇన్నింగ్స్‌లతో..

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో కార్తీక్ 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. దాంతో ఆ మ్యాచ్‌లో ఆర్‌సీబీ అద్భుత విజయాన్నందుకుంది. ఈ ఒక్క మ్యాచే కాదు.. ఆర్‌సీబీ ఫినిషర్‌గా ప్రతీ మ్యాచ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. కార్తీక్ 2.oగా చెలరేగుతున్నాడు. వరుసగా 6 మ్యాచ్‌ల్లో 32*(14), 14*(7), 44*(23), 7*(2), 34(14), 66*(34) స్ట్రైక్ రేట్ 209.57‌తో 190 పరుగులు చేశాడు.

 టీమిండియాలోకి రీఎంట్రీనే టార్గెట్..

టీమిండియాలోకి రీఎంట్రీనే టార్గెట్..

ఢిల్లీతో మ్యాచ్ అనంతరం మాట్లాడిన కార్తీక్.. టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడమే తన లక్ష్యమని చెప్పాడు. టీమిండియాలో చోటు కోసం తాను అన్ని విధాలుగా క‌ష్ట‌ప‌డుతున్నాన‌ని తెలిపాడు. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌ర‌గ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త జట్టు త‌రపున ఆడాల‌న్న త‌న కోరిక‌ను కార్తీక్ వ్య‌క్తం చేశాడు. "భారత్ త‌రుపున మ‌ళ్లీ ఆడాలనేది నా ల‌క్ష్యం. టీ20 ప్రపంచకప్‌ దగ్గరలోనే ఉందని నాకు తెలుసు.నేను జట్టులో చోటు కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాను.

వరల్డ్ కప్ విజయంలో..

వరల్డ్ కప్ విజయంలో..

వ‌ర‌ల్డ్‌క‌ప్‌ జట్టులో బాగ‌మై భార‌త్ విజ‌యంలో నా వంతు పాత్ర పోషించాలి అనుకుంటున్నాను. భార‌త్ ఐసీసీ టోర్న‌మెంట్‌ల‌ను గెలిచి చాలా కాలం అయ్యింది. కాబట్టి భార‌త్ ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో టైటిల్ నెగ్గాల‌ని కోరుకుంటున్నాను" అని కార్తీక్ పేర్కొన్నాడు. కాగా 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ జ‌ట్టుకు కార్తీక్ ప్రాతినిధ్యం వ‌హించాడు. ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. నిదహాస్ ట్రోఫీలో లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి గెలిపించిన అతని ఇన్నింగ్స్ చరిత్రలో నిలిచిపోయింది.

Story first published: Tuesday, April 19, 2022, 18:00 [IST]
Other articles published on Apr 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+