ఏం మేసేజ్ కావాలి? కెప్టెన్సే లేదు.. పక్కోడి గురించి నీకెందుకు? కోహ్లీ తీరుపై దిగ్గజ క్రికెటర్ ఫైర్!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యవహార శైలిని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు. మాజీ క్రికెటర్లను ఉద్దేశిస్తూ విరాట్ చేసిన పరోక్ష వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసలు మాజీ క్రికెటర్ల నుంచి విరాట్ కోహ్లీ ఏం మేసెజ్ ఆశించాడని ప్రశ్నించాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాకా.. బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టకుండా ఈ అనవసర చర్చకు తెరలేపడం అవసరమా? అని నిలదీసాడు.
ఆసియాకప్ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న విరాట్ కోహ్లీ... కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సమయంలో తనకు ధోనీ తప్పా ఎవరూ మెసేజ్ చేయలేదన్నాడు.

ఎవరు పలకరించలేదో చెప్పాలి..?
తన నంబర్ ఎంతో మంది దగ్గర ఉన్నప్పటికీ ఎవరూ తనను పలకరించలేదని చెప్పాడు. ధోనీతో తనకు ఉన్న అనుబంధం ప్రత్యేకమని చెప్పాడు. టీవీల్లో తనకు సూచనలు చేసినవారు కూడా మెసేజ్ చేయలేదని దిగ్గజ ఆటగాళ్లను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. సునీల్ గవాస్కర్ ఇండియా టుడే మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలపై స్పందించాడు.
తనకు మెసేజ్ పెట్టింది ధోనీ మాత్రమేనని చెప్పిన కోహ్లీ.. తనను పలకరించిన వ్యక్తుల పేర్లను కూడా చెప్పాలని డిమాండ్ చేశాడు. 'డ్రెస్సింగ్ రూమ్‌లో ఇతర ఆటగాళ్లతో పరిస్థితి ఎలా ఉందో నాకు తెలీదు. తనతో టచ్‌లో ఉన్న ఓ వ్యక్తి పేరును కోహ్లీ చెప్పాడంటే.. టచ్‌లో లేని ఇతర వ్యక్తుల పేర్లను సైతం చెప్పాలి.

అసలు ఏం మెసేజ్ కావాలి?
అసలు విరాట్ కోహ్లీకి ఏం మెసేజ్ కావాలి. ఎంకరేజ్‌మెంట్ కావాలా? అప్పటికే కోహ్లీ కెప్టెన్సీని వదులుకున్నాడు కదా?. అలాంటప్పుడు అతనికి ఎంకరేజ్‌మెంట్ దేనికి..? అప్పటికే కెప్టెన్సీ చాప్టర్ ముగిసింది కదా? కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన వ్యక్తి తన ఆట మీదే ఫోకస్ పెట్టడమే మంచిది. ఇప్పుడు నువ్వు ఓ ఆటగాడిగా మాత్రమే ఆడుతున్నావు. కాబట్టి నీ రోల్‌పై ఫోకస్ పెట్టు. నువ్వు కెప్టెన్‌గా ఉన్నప్పుడు నీ సహచరుల గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఒక్కసారి కెప్టెన్సీ వదిలేశాక.. నీ ఆట మీద ఫోకస్ పెట్టాలి' అని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

నాతో ఎవరూ మాట్లాడలేదే..
1985లో తాను కెప్టెన్సీని వదులుకున్నప్పుడు ఎవరూ తనకు ప్రత్యేకంగా మెసేజ్‌లు పెట్టడం గానీ కాల్స్ చేయడం గానీ చేయలేదన్నారు. '1985లో ఆస్ట్రేలియాలో జరిగిన బెన్సన్ అండ్ హెడ్జెస్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ క్రికెట్‌ను గెలిచిన తర్వాత కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాను. ఆ రాత్రి మేం సంబరాలు చేసుకున్నాం, ఒకరినొకరు హత్తుకున్నాం. అంతకు మించి ఏం ఎక్స్‌పెక్ట్ చేయగలం?'అని గవాస్కర్ ప్రశ్నించారు. ఇప్పుడెలాగో కెప్టెన్సీ భారం లేదు కాబట్టి.. ఆటగాడిగా తన ఆటపై శ్రద్ధ పెట్టాలని విరాట్ కోహ్లీకి గవాస్కర్ సూచించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications