For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Shane Warne గురించి అలా మాట్లాడాల్సింది కాదు.. క్షమించండి: సునీల్ గవాస్కర్

Sunil Gavaskar apologises for pretty ordinary record comment on Shane Warne

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని భారత మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ తెలిపాడు. ఈ సమయంలో అలా మాట్లాడాల్సింది కాదని, తనను క్షమించాలని అభిమానులను కోరాడు. టీవీ హోస్ట్ తనను ఆ ప్రశ్న అడగాల్సింది కాదని, అతని కారణంగానే తాను ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు. ఇక థాయ్‌లాండ్‌కు వెకేషన్‌కు వెళ్లిన షేన్ వార్న్ గత శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అతని అకాల మరణం నేపథ్యంలో ఇండియా టుడే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది.

గొప్ప స్పిన్నర్ కాదంటూ..

గొప్ప స్పిన్నర్ కాదంటూ..

ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ఈ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరించగా.. సునీల్ గవాస్కర్‌తో పాటు ఇంకొందరూ చీఫ్ గెస్ట్‌లుగా పాల్గొన్నారు. ఇక గవాస్కర్‌ను మీరు చూసిన అత్యుత్తమ స్పిన్నర్‌ వార్న్‌రేనా? అని హోస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగాడు. దీనికి గవాస్కర్ కాదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. 'నా దృష్టిలో షేన్‌ వార్న్‌ అత్యుత్తమ స్పిన్నర్‌ కాదు. భారత స్పిన్నర్లు, ముత్తయ్య మురళీధరన్‌ అతనికన్నా మెరుగైన స్పిన్నర్లు. ఎందుకంటే భారత్‌లో వార్న్ రికార్డు చాలా సాధారణం. భారత్‌లో ఒక్కసారి మాత్రమే అతను ఐదు వికెట్ల ఘనత సాధించాడు. స్పిన్‌లో బాగా ఆడగల భారత బ్యాట్స్‌మెన్‌పై పెద్దగా విజయవంతం కాని అతణ్ని గొప్ప స్పిన్నర్‌ అని అనలేను'అని గవాస్కర్‌ చెప్పుకొచ్చాడు.

అభిమానుల ఆగ్రహం..

అభిమానుల ఆగ్రహం..

ఇక సునీల్ గవాస్కర్‌ వ్యాఖ్యలపై దుమారం రేగింది. 'నీకు అసలు బుద్దుందా? ఏ సందర్భంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావ్‌'అని అభిమానులు మండిపడ్డారు. ఇంగిత జ్ఞానం లేకుంటే ఎలా అని ఘాటుగా విమర్శించారు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఎవరైనా అతని మంచి పనులు, గొప్పతనం గురించే మాట్లాడుతారని, అది కూడా తెలియకపోతే ఎలా అంటూ చురకలంటించారు. ఈ ట్రోలింగ్ నేపథ్యంలో తన తప్పును తెలుసుకున్న సునీల్ గవాస్కర్.. అభిమానులకు క్షమాపణలు చెప్పాడు.

సారీ.. అలా అనాల్సింది కాదు..

సారీ.. అలా అనాల్సింది కాదు..

'నిజానికి ఈ సమయంలో అలాంటి ప్రశ్న అడగాల్సింది కాదు. నేనూ జవాబు చెప్పి ఉండాల్సింది కూడా కాదు. పోలికలు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. యాంకర్‌ అడిగిన ప్రశ్నకు నేను నిజాయితీగా నా అభిప్రాయం చెప్పా. వార్న్‌ క్రికెట్‌ చూసిన గొప్ప ఆటగాళ్లలో ఒకడు. రాడ్నీ మార్ష్‌ ఉత్తమ వికెట్‌ కీపర్లలో ఒకడు. వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నా'అని గవాస్కర్ తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు.

Story first published: Tuesday, March 8, 2022, 8:55 [IST]
Other articles published on Mar 8, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+