Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరుష్క జోడీకి విందు ఇచ్చిన ఫుట్‌బాల్ కెప్టెన్

Sunil Chhetri’s wife Sonam posts heartwarming message as couple host Virat Kohli, Anushka Sharma for dinner

బెంగళూరు: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అతని సతీమణి అనుష్క శర్మలకు భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రీ, అతని భార్య సోనమ్ భట్టా ఛార్జీ విందు ఇచ్చారు.

ఆస్ట్రేలియాతో మూడో వన్డే విజయానంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీ నేరుగా ఈ ఫుట్‌‌బాల్ స్టార్ ఆహ్వానం మేరకు బెంగళూరులోని ఛేత్రీ స్వగృహానికి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోనమ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.

''ఫోన్లు లేవు(ఈ ఫొటో దిగేవరకు), గడియారాన్ని గమనించలేదు. నలుగురు విభిన్నమైన వ్యక్తులు సూర్యుడి కింద కూర్చొని అన్ని విషయాలను మాట్లుడుకోవడం జరిగింది. మీ ఇద్దరికి ఆతిథ్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరు అద్భుతమైన మనుషులు'' అంటూ సోనమ్ ఆ ఫొటోకు క్యాప్షన్‌గా పేర్కొంది.

దీనికి అనుష్క సైతం తనదైన శైలిలో బదులిచ్చింది. ''మీతో సాయంత్రం చాలా సరదగా గడిచింది. వచ్చేసారి మీకు చెప్పకుండానే మీ ఇంటికి వచ్చేస్తాము'' అంటూ అనుష్క ఆ పోస్ట్‌కి కామెంట్ చేసింది.

ఇక సునీల్ ఛెత్రీ సైతం తనస్టైల్లో ఫొటోను పంచుకున్నాడు. 'ఈ ఫొటోలో ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు. మిగతా ఇద్దరు జీవనోపాధి కోసం క్రికెట్ మరియు ఫుట్‌బాల్ ఆడతారు. అద్భుతమైన జీవిత ప్రయాణంలో అదృష్టం, ప్రేమ భాగమని నేను నమ్ముతాను'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

Story first published: Monday, January 20, 2020, 20:12 [IST]
Other articles published on Jan 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+