Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2027: CSK బ్యాటింగ్ కోచ్‌గా మహేంద్ర సింగ్ ధోనీ!

ఐపీఎల్ 2027 సీజన్ మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ తమ కోచింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేసింది. జహీర్ ఖాన్‌ను హెడ్‌కోచ్‌గా నియమించిన సీఎస్‌కే యాజమాన్యం.. ఇంగ్లండ్ దిగ్గజం గారెత్ బ్యాటీ అసిస్టెంట్ కోచ్‌గా.. భారత మాజీ పేసర్ మోహిత్ శర్మ‌ను బౌలింగ్ కోచ్‌గా.. సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ అల్బీ మోర్కెల్‌ను అసిస్టెంట్ కోచ్‌గా.. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జేమ్స్ ఫోస్టర్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా.. భారత మాజీ క్రికెటర్ శ్రీధర్ శ్రీరామ్‌ను అసిస్టెంట్ కోచ్‌లుగా నియమించింది. అయితే బ్యాటింగ్ కోచ్‌ను మాత్రం నియమించలేదు. దాంతో బ్యాటింగ్ కోచ్ ఎవరా? అనేది చర్చనీయాంశమైంది.

అయితే బ్యాటింగ్ కోచ్‌గా సీఎస్‌కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఆ జట్టు మాజీ క్రికెటర్ సుబ్రమణ్యమ్ బద్రీనాద్ అంచనా వేసాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన బ్రదీనాద్.. మెంటార్‌గా సేవలందించే అవకాశం ఉందన్నాడు.

Subramaniam Badrinat Predicts MS Dhoni To Become CSK s Batting Coach For IPL 2027

'సీఎస్‌కేకు ముగ్గురు అసిస్టెంట్ కోచ్‌లు ఉన్నారు. కానీ బ్యాటింగ్ కోచ్‌ను నియమించలేదు. ధోనీనే మెంటార్, బ్యాటింగ్‌ కోచ్‌గా సేవలందిస్తాడని నాకు అనిపిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే బ్యాటింగ్‌ కోచ్‌ను ఎంపిక చేయలేదనిపిస్తోంది. సీఎస్‌కే సీఈఓ కూడా తమకు బ్యాటింగ్ కోచ్ ఉండరని తెలిపారు. బ్యాటింగ్ కోచ్‌గా ధోనీ ఈ విషయాన్ని పరిశీలిస్తారేమో.. దాని ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకొని ఉండచ్చు.'అని బద్రీనాథ్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌లో ధోనీ ఇంకా ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. గాయం కారణంగా గత సీజన్‌ మొత్తానికి ధోనీ దూరంగా ఉన్నాడు. ఫిట్‌గా ఉంటేనే ఐపీఎల్ 2027 సీజన్ ఆడుతానని ఇప్పటికే చెప్పాడు. 2020లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ అప్పటి నుంచి కేవలం ఐపీఎల్‌లోనే కొనసాగుతున్నాడు.

2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. 2017 నుంచి దేశవాళీ క్రికెట్ ఆడటం లేదు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అనామక ఆటగాడిగా చెన్నై జట్టులోకి వచ్చిన ధోనీ.. ఐపీఎల్ 2027 సీజన్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ధోనీ స్థానాన్ని సీఎస్‌కే సంజూ శాంసన్‌తో భర్తీ చేసింది. ఐపీఎల్ 2027 సీజన్‌లో ధోనీ మెంటార్‌గా సేవలందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

Story first published: Saturday, October 31, 2026, 18:59 [IST]
Other articles published on Oct 31, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+