Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆరోజు బట్టలిప్పి నుదిట గన్ పెట్టి బెదిరించారు.. సంచలన విషయాలు వెల్లడించిన ఆసీస్ మాజీ స్పిన్నర్!

Stuart MacGill says They stripped me naked, beat me up, and dumped me

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ స్టువర్ట్ మెక్ గిల్.. తన కిడ్నాప్‌కు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించాడు. గతేడాది తనను కిడ్నాప్ చేసిన దుండగులు నగ్నంగా మార్చి పాయింట్ బ్లాక్‌లో గన్ పెట్టి బెదిరించారని చెప్పాడు. గతేడాది మార్చిలో పలువురు దుండగులు సిడ్నీలోని తన ఇంటి నుంచి కిడ్నాప్ చేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఇన్నాళ్లు దాని గురించి నోరు విప్పని మెక్ గిల్ తాజాగా.. ఓ ఇంటర్వ్యూలో ఆ ఘటనకు సంబంధించిన విషయాలను వెల్లడించాడు.

 నగ్నంగా మార్చి..

నగ్నంగా మార్చి..

'ఆ ఘటనను తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తున్నది. మనం అత్యంత అసహ్యించుకునే శత్రువులకు కూడా అలా జరుగకూడదు. కిడ్నాప్ అయిన రోజు పలువురు సిడ్నీలోని నా ఇంటికి వచ్చి నన్ను ఎత్తుకెళ్లారు. వాళ్లు నన్నెక్కడికి తీసుకెళ్లారో కూడా నాకు తెలియదు. నా కళ్లకు గంతలు కట్టి కార్‌లో పడేశారు. నేను కార్లోకి ఎక్కనంటే వాళ్ల దగ్గర ఉన్న ఆయుధాలతో నన్ను బెదరించారు. కార్లో మేము సుమారు గంటన్నర ప్రయాణం చేశాం. అయితే వాళ్లు నన్ను ఎక్కడికి తీసుకెళ్లారనేదానిపై నాకు అంత స్పష్టత లేదు. ఒక చోటుకు తీసుకెళ్లిన తర్వాత వాళ్లు నా పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి బెదిరించారు. నా బట్టలన్నీ విప్పేసి నన్ను నగ్నంగా మార్చి తీవ్రంగా కొట్టారు.

రెండునెలలు దాక్కున్నా..

రెండునెలలు దాక్కున్నా..

అప్పుడు నేను చాలా భయపడ్డాను. తీవ్రంగా గాయపడ్డాను.నన్ను చితక్కొట్టిన దుండగులు ఆ తర్వాత కార్ డిక్కీలో కుక్కి.. నన్ను బెల్మోర్ లో పడేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత నేను కొద్దిరోజుల పాటు ఇంటికి వెళ్లలేదు. ఒక మిత్రుడు నన్ను మూడు వారాల పాటు ఓ హోటల్ లో ఉంచాడు. ఆ సమయంలో నేను కనీసం రెండు నెలల పాటు భయంతో ఇంటికే రాలేదు. ఆ తర్వాత పోలీసులు ఈ కేసుతో సంబంధమున్న నలుగురిని అరెస్ట్ చేశారు. అప్పుడే నేను ప్రశాంతంగా మళ్లీ ఇంటికొచ్చా..' అని తెలిపాడు.

 208 వికెట్లు...

208 వికెట్లు...

గతేడాది మార్చిలో మెక్ గిల్ ను కిడ్నాప్ చేసిన దుండగులు చేయడంతో ఇది అపహరణ కేసు అనుకున్నారంతా. కానీ ఈ కేసులో మెక్ గిల్ భార్య తమ్ముడి హస్తం ఉందని తేలింది. డ్రగ్ డీల్ విషయంలో మెక్ గిల్ ఇన్వాల్వ్ అయ్యాడని, అందుకే దుండగులు అతడిని కిడ్నాప్ చేసి వార్నింగ్ ఇచ్చారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. 1998-2008 మధ్య ఆసీస్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన మెక్ గిల్.. టెస్టు, వన్డే ఫార్మాట్లలో ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో 44 టెస్టులాడిన మెక్​గిల్​ 208 వికెట్లు సాధించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్​లో మూడు మ్యాచ్​లాడి 6 వికెట్లను తీశాడు.

Story first published: Saturday, June 18, 2022, 14:36 [IST]
Other articles published on Jun 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+