బాల్ ట్యాంపరింగ్ ఉదంతంపై డేవిడ్ వార్నర్ బుక్ రాస్తాడనుకుంటున్నా: స్టువర్ట్ బ్రాడ్

లండన్: ఆస్ట్రేలియా క్రికెట్‌లో బాల్ ట్యాంపరింగ్ ఉదంతం మరోసారి కలకలం రేపుతోంది. ఈ ఘటన జరిగి మూడేళ్లు పూర్తియినా.. ఈ ఉదంత సూత్రదారి కామెరూన్ బెన్‌క్రాఫ్ట్ తన సంచలన వ్యాఖ్యలతో మరో చర్చకు తెరదీశాడు. బాల్ ట్యాంపరింగ్ విషయం కెప్టెన్ స్మిత్ , వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌తో పాటు బౌలర్లందరికీ తెలుసని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాంబు పేల్చాడు. దాంతో ఈ ఉదంతంపై పై సమగ్ర విచారణ జరిపించడంలో క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) విఫలమైందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా సరైన రీతిలో దర్యాప్తు చేపట్టలేదని డేవిడ్ వార్నర్ మేనేజర్ జేమ్స్ ఎర్స్కైన్ విమర్శించాడు. ఆటగాళ్లందరినీ విచారించకుండా ఆసీస్ బోర్డు ఏకపక్ష నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఈ విషయంపై స్పందించాడు. ఈ వివాదం కారణంగా శిక్ష అనుభవించిన డేవిడ్ వార్నర్ దానిపై ఓ పుస్తకం రాస్తే బాగుంటుందని తెలిపాడు.

ఆసీస్ జట్టులో అది కనిపించలేదు..
'బెన్‌క్రాఫ్ట్ వ్యాఖ్యలతో బాల్ టాంపరింగ్ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. నేను ఆస్ట్రేలియాకు బౌలింగ్ చేసి ఉండకపోవచ్చు. కానీ ఇంగ్లండ్ తరపున బౌలింగ్ చేసేటప్పుడు ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయె చెప్పాలనుకుంటున్నా. ఒకవేళ బౌలింగ్ సమయంలో నా సీమ్‌లో తేడా ఉంటే అండర్సన్ సలహాలు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. బాల్ టాంపరింగ్ జరిగిన రోజు ఆసీస్ జట్టులో ఇది కనిపించలేదు. బంతిని రివర్స్‌సింగ్ రాబట్టడం కోసం బెన్‌క్రాఫ్ట్ ఆ పని చేసి ఉండొచ్చు. కానీ టెస్టుల్లో ఉపయోగించే ఎర్రబంతి పాతబడ్డాక స్వింగ్ రాబట్టడం కొంచెం కష్టమే. కానీ దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. వాటిని ఆసీస్ ఉపయోగించుకోలేదు.

డేవిడ్ వార్నర్ బుక్ రాయాలి..
బాల్ టాంపరింగ్ వివాదంపై డేవిడ్ వార్నర్ ఏజెంట్ చేసిన వ్యాఖ్యలు విన్నా. ఆస్ట్రేలియా జట్టుకు రిటైర్మెంట్ ప్రకటించాక వార్నర్ దీనిపై ఓ పుస్తకం రాస్తే ఎలా ఉంటుందో చూడాలని ఉంది. ఈ వివాదం ముగిసిపోయిందని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు భావించింది. కానీ శిక్ష పడిన ఆ ముగ్గురు ఆటగాళ్లకు దీని నుంచి బయటపడటం చాలా కష్టం. ఈ ఏడాది జరిగే యాషెస్ సిరీస్ సందర్భంగా ఈ ఉందంతం ఖచ్చితంగా తెరపైకి వస్తుంది'అని చెప్పుకొచ్చాడు. కాగా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు ప్రతిష్టాత్మకంగా భావించే యాషెస్ సిరీస్ నవంబర్,డిసెంబర్‌లో జరగనుంది. దీనికి ముందు ఇంగ్లండ్ జట్టు కివీస్, భారత్‌తో టెస్టు సిరీస్‌లు ఆడనుంది.

రివర్స్ స్వింగ్ తగ్గిపోయింది..
ఈ వివాదంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గిల్‌క్రిస్ట్ స్పందిస్తూ విచారణ సరిగా జరగలేదని తెలిపాడు. "సమస్య మూలాల్లోకి వెళ్లి సమగ్రమైన విచారణ చేపట్టడం ద్వారా ఒక బలమైన సందేశాన్ని ఇవ్వడానికి అప్పుడు అవకాశం లభించింది. కానీ సీఏ ఆ లోతుల్లోకి వెళ్లాలనుకోలేదు. ఈ సమస్య వ్యవస్థీకృతం అయిందా అని విచారించే ప్రయత్నం చేయలేదు. ఆ ఉదంతం తర్వాత ప్రపంచ క్రికెట్లో రివర్స్ స్వింగ్ బాగా తగ్గిపోయింది. ఆటగాళ్లపై శిక్షలు పడటం వల్ల జరిగిన మంచి పరిణామం ఇది" అని గిల్లీ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications