Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎందుకీ ఈ నాటకాలు..? పాక్ ఆటగాడిపై స్టువర్ట్ బ్రాడ్ ఫైర్!

పాకిస్థాన్ బ్యాటర్ ఇమామ్ ఉల్ హక్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గాయంతో వార్మప్ చేయడం అవసరమా? అంటూ మండిపడ్డాడు. ఎందుకీ నాటకాలని, తనకు ఏ మాత్రం నచ్చలేదని ఎద్దేవా చేశాడు.

మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ రెండో టెస్ట్‌లోనూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. 389 పరుగుల భారీ లక్ష్య ఛేధనకు దిగిన పాకిస్థాన్ 194 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ)2027 పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. పాకిస్థాన్‌తో పాటు ఇంగ్లండ్‌కు కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు లేవు.

Stuart Broad Criticises Imam-ul-Haq Injury Antics After Pakistan Opener Withdraws From Lord s Test

గాయంతో వార్మప్.. అవసరమా..?

అయితే ఈ మ్యాచ్‌లో ఇమామ్ ఉల్ హక్ గాయం కారణంగా బ్యాటింగ్‌ చేయలేదు. తొలి ఇన్నింగ్స్‌తో పాటు రెండో ఇన్నింగ్స్‌లోనూ అతను బ్యాటింగ్‌కు దూరంగా ఉన్నాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌కు ముందు ఇమామ్ ఉల్ హక్ మైదానంలో వామప్ చేస్తూ కనిపించాడు. ఇది టీవీ కెమెరాల్లో కనిపించగా.. స్టువర్ట్ బ్రాడ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు.

పాకిస్థాన్ ఓ చెత్త టీమ్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

పాకిస్థాన్ ఓ చెత్త టీమ్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

'ఇమామ్ ఉల్ హక్ వార్మప్ అంతా డ్రామానే. కెమెరాల ముందు షో చేసేందుకే అతను ఇలా చేస్తున్నాడు. మీడియా, తన సహచరుల నుంచి అటెన్షన్ కోసం వార్మప్ చేస్తూ గాయం వల్ల బాధపడుతున్నట్లు నటిస్తున్నాడు. ఇలా ఎవరూ చూడకుండా గదిలో చేస్తే ఫర్వాలేదు. కానీ షార్ట్స్ వేసుకొని కాళ్లకు టేప్‌తో మైదానంలోకి వచ్చి వామప్ చేయాల్సిన అవసరం ఎం ఉంది? నిజంగా గాయమైతే ఇక్కడ ఎవరూ అడ్డు చెప్పరు కదా..? నాకైతే అతని ప్రవర్తన ఏ మాత్రం నచ్చడం లేదు.'అని బ్రాడ్ ఘాటుగా విమర్శించాడు.

అత్యంత చెత్త బోర్డు పీసీబీ..

పాకిస్థాన్ మాజీ ప్లేయర్ మహ్మద్ వసీమ్ సైతం.. ఇమామ్ ఉల్ హక్ తీరును తప్పుబట్టాడు. బ్యాటింగ్ చేయకుండా తప్పించుకునేందుకు ఇమామ్.. గాయం డ్రామా ఆడినట్లు అనిపిస్తుందని ఆరోపించాడు. కెమెరాల ముందు బ్యాటింగ్ కోసం తాను కష్టపడుతున్నట్లుగా ఫోజు ఇచ్చినట్లు ఉందన్నాడు.

టెస్ట్‌ల్లోనూ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 7 సిక్స్‌లతో వీరవిహారం!

Also Read

టెస్ట్‌ల్లోనూ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. 7 సిక్స్‌లతో వీరవిహారం!

మరోవైపు ఇమామ్‌ ఎడమ కాలి కండరాలు పట్టేసాయని, అందుకే బరిలోకి దిగలేదని పాకిస్థాన్ మేనేజ్‌మెంట్ వెల్లడించింది. మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై ఆదేశ మాజీ క్రికెటర్ రషీద్ లీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అత్యంత చెత్త క్రికెట్ బోర్డు పీసీబీనేనన్నాడు. పాకిస్థాన్ జట్టు నాశనానికి ప్రధాన కారణం పీసీబీనేనని ధ్వజమెత్తాడు.

Story first published: Monday, August 31, 2026, 13:01 [IST]
Other articles published on Aug 31, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+