AUS vs BAN: కుక్క తోక వంకరే.. మారని స్మిత్ బుద్ది!అంపైర్ వార్నింగ్! (వీడియో)
కెరీర్ చివరి దశకు చేరుకున్నా.. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ బుద్ది మాత్రం మారలేదు. మరోసారి తన దుర్బుద్ధిని స్మిత్ బయటపెట్టుకున్నాడు. బాల్ టాంపారింగ్ వివాదంతో నిషేధం ఎదుర్కొన్నా.. కెప్టెన్సీ అవకాశాన్ని కోల్పోయినా.. యావత్ క్రికెట్ ప్రపంచం ముందు ఛీటర్‌గా నిలబడినా స్మిత్‌కు ఏ మాత్రం బుద్ది రాలేదు.
పసికూన బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌లో ఎదురైన పరాజయంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మైండ్ గేమ్ మొదలుపెట్టారు. శనివారం ప్రారంభమైన రెండో టెస్ట్‌లో కవ్వింపులకు పాల్పడ్డారు. ముఖ్యంగా స్మిత్ ప్రత్యర్థి ఆటగాళ్లను రెచ్చగొట్టి అంపైర్ మందలింపునకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..?
సాధారణంగా స్మిత్ తన చర్యలతో ప్రత్యర్థులను తప్పుదోవ పట్టించాలని చూస్తుంటాడు. సరిగ్గా రెండో టెస్ట్‌లోనూ అదే చేయబోయాడు. బంగ్లా ఆటగాళ్లు మాత్రం స్మిత్ దుర్బుద్దిని పసిగట్టి తెలివిగా వ్యవహరించారు. టస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో స్మిత్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేయగా.. బంతి అతని ప్యాడ్లను తాకింది. దాంతో బంగ్లా ఆటగాళ్లు అప్పీల్ చేశారు. కానీ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దాంతో టస్కిన్ అహ్మద్.. రివ్యూ తీసుకుందామా? అని కెప్టెన్ నజ్ముల్ షాంటోను అడిగాడు. డీఆర్‌ఎస్‌కు షాంటో నిరాకరించాడు. బంతి స్టంప్స్ పైకి వెళ్లిందని చెప్పాడు.

అక్కడే వారి సంభాషణను విన్న స్మిత్.. రివ్యూ తీసుకోవాలని చెప్పాడు. అతని మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. కానీ బంగ్లా ఆటగాళ్లు అతన్ని పట్టించుకోలేదు. కాసేపటికే ఫీల్డ్ అంపైర్లు స్మిత్‌కు వార్నింగ్ ఇచ్చారు. స్మిత్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సీనియర్ క్రికెటర్‌గా ఎదిగినా బుద్ది మారలేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కుక్క తొక వంకరే అన్నట్లు.. స్మిత్ బుద్ది కూడా వంకరే అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు బంగ్లాదేశ్ బ్యాటింగ్ సందర్భంగా టస్కిన్ అహ్మద్, జోష్ హేజిల్ వుడ్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది.
ఆసీస్‌కు ఆధిక్యం..
ఈ మ్యాచ్‌లో బౌలర్లు ఆధిపత్యం చెలాయించడంతో తొలి రోజే 18 వికెట్లు నెలకూలాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లలో 64 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ (6/12) ఆరు వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. ప్యాట్ కమిన్స్(3/25) మూడు వికెట్లు తీయగా.. జోష్ హేజిల్ వుడ్ ఒక వికెట్ పడగొట్టాడు.
అనంతరం ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 165 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్(81 బంతుల్లో 8 ఫోర్లతో 51 బ్యాటింగ్),స్టీవ్ స్మిత్(74 బంతుల్లో 6 ఫోర్లతో 42) రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్(6/35) ఆరు వికెట్లు తీయగా.. టస్కిన్ అహ్మద్, మెహ్‌దీ హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు. ప్రస్తుతం ఆసీస్ 101 పరుగుల ఆధిక్యంలో ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
