
కలిస్ రికార్డు బద్దలు
ఇప్పటివరకు దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ పేరిట ఈ రికార్డు ఉండేది. కలిస్ 9 సార్లు ఒకే టెస్టు మ్యాచ్‌లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పుడు స్టీవ్ స్మిత్ అగ్రస్థానంకు దూసుకెళ్లాడు. మూడో స్థానంలో ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ ఉన్నాడు. కుక్ 8 సార్లు ఒకే టెస్టులో సెంచరీ, హాఫ్ సెంచరీ చేశాడు. ఇక భారత్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్..ఆసీస్ ఆటగాళ్లు రికీ పాంటింగ్, అలెన్ బోర్డర్.. శ్రీలంక ప్లేయర్ కుమార సంగక్కర ఏడు సార్లు ఒకే టెస్టులో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసి నాలుగో స్థానంలో ఉన్నారు.

రెండు ఇన్నింగ్స్‌లలో 50కి పైగా స్కోర్
తొలి రెండు టెస్టుల్లో విఫలమయిన స్టీవ్ స్మిత్ మూడో టెస్టులో మాత్రం సత్తాచాటాడు. రెండు ఇన్నింగ్స్‌లలో 50కి పైగా స్కోర్ చేసిన స్మిత్.. దిగజాల సరసన చేరాడు. రెండు ఇన్నింగ్స్‌లలో 50కి పైగా స్కోర్ చేసిన బ్యాట్స్‌మన్ జాబితాలో రికీ పాంటింగ్ ముందున్నాడు. పాంటింగ్ 15 సార్లు రెండు ఇన్నింగ్స్‌లలో 50కి పైగా స్కోర్ చేశాడు. కలిస్, కుక్ చెరో 14 సార్లు.. బోర్డర్ (13), సంగక్కర (12) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇంజమాముల్ హాక్, శివనరేన్ చంద్రపాల్ చెరో 11 సార్లు రెండు ఇన్నింగ్స్‌లలో 50కి పైగా స్కోర్ చేశారు. తాజాగా ఇంజీ, చంద్రపాల్ సరసన స్టీవ్ స్మిత్ చేరాడు.

స్మిత్ హాఫ్ సెంచరీ
ఆదివారం ఉదయం 103/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేసింది. తొలి సెషన్‌లో 79 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్.. రెండో సెషన్‌లోనూ మరో రెండు వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. లబుషేన్ (73; 118 బంతుల్లో 9x4), స్మిత్ (81; 167 బంతుల్లో 8x4, 1x6) గ్రీన్ (84; 132 బంతుల్లో 8x4, 4x6) అర్ధ శతకాలతో రాణించారు. కెప్టెన్ టిమ్ పైన్ (39; 52 బంతుల్లో 6x4) ధాటిగా ఆడి ఆస్ట్రేలియా భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు.

తొలి వికెట్‌కు 71 పరుగులు
మూడో టెస్టులో రహానే సేన గెలవాలంటే సోమవారం చివరి రోజు 309 పరుగులు చెయ్యాలి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. క్రీజులో చేటేశ్వర్ పుజారా (9), అజింక్య రహానే (4) ఉన్నారు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 407 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఓపెనర్లు.. రోహిత్ శర్మ (52; 98 బంతుల్లో 5x4, 1x6), శుభ్‌మన్ గిల్ (31; 64 బంతుల్లో 4x4) శుభారంభం చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించారు.
ముగిసిన నాలుగో రోజు.. భారీ ఛేదనలో గిల్, రోహిత్ ఔట్.. గెలవాలంటే 309 కొట్టాలి!!


Click it and Unblock the Notifications












