Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాపం స్మిత్.. విచిత్రకర రీతిలో ఔట్!(వీడియో)

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను దురదృష్టం వెంటాడింది. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో స్టీవ్ స్మిత్ విచిత్రకర రీతిలో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో శతకం సాధించిన స్మిత్ చివరకు నమ్మశక్యం కానీ రీతిలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఆకాశ్ దీప్ వేసిన 115వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని స్టెప్ ఔటై ఆఫ్ సైడ్ ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి అతని ప్యాడ్స్‌ను తాకి మెల్లిగా లెగ్ స్టంప్‌ బెయిల్‌ను కిందపడేసింది. నిస్సహాయంగా స్మిత్ చూస్తూ నిలబడిపోయాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు. అసాధారణ బ్యాటింగ్ చేసిన స్టీవ్ స్మిత్‌కు మెల్ బోర్న్ ప్రేక్షకులు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు.

Steve Smith Suffers Unlucky Dismissal in IND vs AUS 4th Test Video Goes Viral

ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ వికెట్‌పై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. గాశారం బాలేకపోతే ఇలానే ఉంటుందని, ఇదేందయ్యా ఇది మేం ఏడా చూడలే అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.

దురదృష్టవశాత్తు స్మిత్ వెనుదిరిగినా భారత్‌కు చేయాల్సిన నష్టం చేశాడు. 197 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 140 పరుగులతొ భారత బౌలర్లను చెడుగుడు ఆడాడు. ఓపికగా బ్యాటింగ్ చేస్తూ వారి సహనాన్ని పరీక్షించాడు. 311/6 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. స్మిత్ సెంచరీతో భారీ స్కోర్ చేసింది. 68 పరుగుల వ్యక్తిగత ఓవర్‌నైట్ స్కోర్‌తో బరిలోకి దిగిన స్మిత్.. 167 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో కలిసి ఏడో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు.

హాఫ్ సెంచరీకి చేరువైన ప్యాట్ కమిన్స్(49)ను జడేజా ఔట్ చేయడంతో ఆసీస్ 454/7 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. రెండో సెషన్ ఆరంభంలోనే మిచెల్ స్టార్క్(15)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేయగా.. ఆ మరుసటి ఓవర్‌లోనే స్టీవ్ స్మిత్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో స్కాట్ బోలాండ్, నాథన్ లయన్ ఉన్నారు.

Story first published: Friday, December 27, 2024, 8:11 [IST]
Other articles published on Dec 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+