టాస్ ఓడటమే మా విజయానికి కలిసొచ్చింది: స్మిత్

ఇండోర్: సొంతగడ్డపై టీమిండియాను ఓడిస్తే వచ్చే కిక్ వేరేలా ఉంటుందని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో సమష్టిగా రాణించిన ఆసీస్ 9 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ విజయానంతరం మాట్లాడిన స్మిత్.. సమష్టి ప్రదర్శనతో భారత్‌ను ఓడించామని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోవడం, తొలి రోజు ఆసీస్ బౌలర్లు చెలరేగడం తమ విజయానికి కలిసొచ్చిందన్నాడు. ఇదే జోరును చివరి మ్యాచ్‌లోనూ కొనసాగించి సిరీస్‌ను సమం చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు. తన సారథ్యంలో విజయం సాధించడం మరింత సంతోషాన్నిచ్చిందని చెప్పాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఖరారవ్వడంపై కూడా స్మిత్ సంతోషం వ్యక్తం చేశాడు.

టాస్ ఓడిపోవడం కలిసొచ్చింది..
'తొలి రోజు ఆటనే మా విజయానికి బాటలు వేసింది. టాస్ ఓడిపోవడం, ముందుగా బౌలింగ్ చేసి రావడం కలిసొచ్చింది. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా కుహ్నేమన్ తొలి రోజు భారత్ పతనాన్ని శాసించాడు. జట్టులోని ప్రతీ బౌలర్ ఈ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. బ్యాటింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖవాజా అదరగొట్టాడు. మాకు కొన్ని కీలక భాగస్వామ్యాలు లభించాయి. తొలి ఇన్నింగ్స్ చివర్లో భారత బౌలర్లు సత్తా చాటారు. దాంతో మేం కుప్పకూలాం. రెండో రోజు ఆటలోనూ మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.

భారత్‌లో కెప్టెన్సీ చేయడం..
ఓవైపు పుజారా ఒంటరి పోరాటం చేసినా మరోవైపు వరుసగా వికెట్లు తీసారు. ఇది సమష్టి విజయం. ప్యాట్ కమిన్స్ స్వదేశం తిరిగి వెళ్లడం కాస్త బాధపెట్టినా.. మా ఆటను ఆస్వాదించాం. ముఖ్యంగా ఈ వారం నేను నా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాను. భారత్‌లో కెప్టెన్సీ చేయడం అంటే నాకు పిచ్చి. ఇక్కడి కఠిన పరిస్థితులను నేను బాగా అర్థం చేసుకున్నాను. ప్రపంచంలోనే నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశం భారత్. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం సంతోషంగా ఉంది. ఇదే అప్రోచ్‌తో చివరి మ్యాచ్ బరిలోకి దిగుతాం. పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. సిరీస్‌ను ఘనంగా ముగిస్తామని ఆశిస్తున్నా.'అని స్మిత్ చెప్పుకొచ్చాడు.

ట్రావిస్ హెడ్ చెలరేగడంతో..
76 పరుగుల లక్ష్యంతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 18.5 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 78 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(0) సిల్వర్ డక్‌గా వెనుదిరిగినా.. ట్రావిస్ హెడ్(53 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 49 నాటౌట్), మార్నస్ లబుషేన్(58 బంతుల్లో 6 ఫోర్లతో 28) అటాకింగ్ గేమ్‌తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ ఒక్కడే ఒక వికెట్ తీసాడు.

పేలవ బ్యాటింగ్‌తో..
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 109 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 197 పరుగులు చేసి 88 పరుగుల భారీ ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలమైన భారత్ 163 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ మాథ్యూ కుహ్నేమన్ ఐదు వికెట్లతో భారత్‌ను దెబ్బతీస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో నాథన్ లయర్ 8 వికెట్లతో పతనాన్ని శాసించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications