Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అశ్విన్‌ను ఒత్తిడిలో ఉంచడమే నా టార్గెట్: స్టీవ్ స్మిత్

Steve Smith says Wanted to put Ravichandran Ashwin under pressure after returning to form in Sydney Test

సిడ్నీ : భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో తన ఫోకస్ అంతా రవిచంద్రన్ అశ్విన్‌పైనే ఉందని ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో అతన్ని ఒత్తిడిలో ఉంచడమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. ఇక తొలి రెండు టెస్ట్‌ల్లో అశ్విన్ ధాటికి దారుణంగా విఫలమైన స్మిత్.. మూడో టెస్ట్‌లో మాత్రం ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. తొలిరోజు ఆట ముగిసిన అనంతరం వర్చువల్‌ కాన్ఫరెన్స్‌లో మీడియాతో మాట్లాడిన స్మిత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అదే నా టార్గెట్..

అదే నా టార్గెట్..

'తొలి రెండు టెస్టుల్లో నా నుంచి ఆశించిన ప్రదర్శన రాలేదు. కానీ మూడో టెస్టు మ్యాచ్‌కు వచ్చేసరికి నా బ్యాటింగ్‌లో కొంత మార్పు కనిపించింది. మొదటిరోజు ఆటలో చివరి సెషన్‌ వరకు నిలిచి లబుషేన్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పడం సంతృప్తినిచ్చింది. అయితే ఈ సిరీస్‌లో అశ్విన్‌పై ఒత్తిడి పెంచడంలో విఫలమయ్యాను.. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం అశ్విన్‌ను ఒత్తిడిలో పడేసే దానిపైనే ప్రత్యేక దృష్టి సారించాను.

ఆరంభంలో తడబడ్డా..

ఆరంభంలో తడబడ్డా..

ఆరంభంలో బంతులను ఎదుర్కోవడంలో కాస్త తడబడ్డా పిచ్ పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చాక బౌండరీలతో పరుగుల రాబట్టడంలో సక్సెస్‌ అయ్యాను. ఇదే టెంపోనూ రెండో రోజు ఆటలోనూ కొనసాగించాలని అనుకుంటున్నా. ఇప్పటికైతే రెండు సెషన్లు కలుపుకొని మేమే పైచేయి సాధించాం'అని స్మిత్ చెప్పుకొచ్చాడు. కాగా వన్డే సిరీస్‌లో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న స్మిత్‌ మొదటి రెండు టెస్టుల్లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు. రెండు టెస్టులు కలిపి 10 పరుగులు చేసిన స్మిత్‌ రెండుసార్లు అశ్విన్‌ బౌలింగ్‌లోనే ఔట్‌ కావడం విశేషం.

ఆసీస్‌దే ఆధిపత్యం..

ఆసీస్‌దే ఆధిపత్యం..

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 55 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. లబుషేన్ 67 పరుగులతో‌, స్టీవ్‌ స్మిత్ 31 పరుగులతో‌ క్రీజులో ఉన్నారు. కాగా మొదటి సెషన్‌లో ఆసీస్‌ 7 పరుగులు చేసిన తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో ఒక సెషన్‌ మొత్తం తూడిచిపెట్టుకుపోయింది.

Story first published: Thursday, January 7, 2021, 20:11 [IST]
Other articles published on Jan 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+