Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ విషయంలో విరాట్ కోహ్లీని మెచ్చుకోవాలి: స్టీవ్ స్మిత్

Steve Smith says Virat Kohli would have faced pressure to stay on but credit to him for taking paternity leave

మెల్‌బోర్న్: పెటర్నిటీ లీవ్ తీసుకున్న టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని మెచ్చుకోవాలని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ అన్నాడు. కోహ్లీ ఫస్ట్ టెస్టు తర్వాత భారత్‌కు తిరుగు ప్రయాణమైన విషయం తెలిసిందే. జనవరిలో అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన అనుష్క శర్మ తొలిసారి బిడ్డకు జన్మనివ్వనుంది. ఈ నేపథ్యంలో ప్రసవసమయంలో ఆమె పక్కన ఉండాలని కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొందరూ సమర్ధించగా.. మరికొందరూ తప్పబట్టారు. అయితే తాజాగా మీడియాతో మాట్లాడిన స్మిత్.. కోహ్లీ నిర్ణయాన్ని ప్రశంసించాలన్నాడు.

విరాట్‌కు విషెస్ చెప్పా..

విరాట్‌కు విషెస్ చెప్పా..

ప్రస్తుత పరిస్థితుల్లో సిరీస్‌ మొత్తం ఇక్కడే ఉండాలంటే కోహ్లీకి ఎంతో ఒత్తిడితో కూడుకున్న వ్యవహారమని పేర్కొన్నాడు. ‘ఈ సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటు. తొలి టెస్టులో అతని బ్యాటింగ్ చూస్తేనే ఈ విషయం అర్థమవుతోంది. అత్యుత్తమ బౌలింగ్‌ విభాగాన్ని కోహ్లీ అద్భుతంగా ఎదుర్కొన్నాడు. అదో క్లాసిక్‌ పెర్ఫామెన్స్. మ్యాచ్ అనంతరం విరాట్‌కు శుభాకాంక్షలు చెప్పా. తొలి బిడ్డ ప్రసవం సందర్భంగా అంతా మంచే జరగాలని ఆకాంక్షించా. ఇది అతని జీవితంలో కీలక ఘట్టం. ఆ సమయంలో అతని సతీమణి అనుష్క శర్మ వెంట ఉండటం మంచిది.'అని ఈ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు.

వెంటనే మర్చిపోవాలి..

వెంటనే మర్చిపోవాలి..

ఫస్ట్ టెస్ట్‌లో భారత జట్టు నమోదు స్వల్ప స్కోర్‌‌పై స్పందిస్తూ.. సిరీస్‌లో టీమిండియా ముందుకు సాగాలంటే ఆ ఇన్నింగ్స్‌ను వెంటనే మర్చిపోవాలన్నాడు. ఆటలో ఇవన్నీ సహజమే. అప్పుడప్పుడూ ఇటువంటివి జరుగుతుంటాయని తెలిపాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ అద్భుతంగా ఉన్నప్పుడు ఇతర జట్లు తక్కువ స్కోర్లకే పరిమితం అవుతాయనిన్నాడు. అలాగే భారత జట్టు తిరిగి ఎలా పుంజుకుంటుందనే విషయాన్ని వివరిస్తూ తొలి టెస్టులో వాళ్లెలా ఔటయ్యారనే వీడియోలు చూసి ఆ బలహీనతలపై శ్రద్ధ వహిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. దాంతో మెరుగవుతుందని తెలిపాడు.

షార్ట్ పిచ్ బంతులు..

షార్ట్ పిచ్ బంతులు..

ఇప్పటికీ టీమ్‌ఇండియాలో నాణ్యమైన ఆటగాళ్లున్నారని, ఇప్పుడు వారు మరింత బాగా పుంజుకుంటారని స్మిత్‌ పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో ఎలా ఆడతారనేది వేచి చూడాలన్నాడు. అలాగే షార్ట్‌పిచ్‌ బంతులు ఆటలో భాగమని, టెయిలెండర్లకు ఆ బంతులేయొద్దన్న ఇయాన్‌ ఛాపెల్‌ వ్యాఖ్యలను స్మిత్ తప్పుబట్టాడు. ఎన్నో ఏళ్లుగా ఆ బంతులేస్తున్నారని స్మిత్‌ వివరించాడు. ఇదిలా ఉండగా, ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ ఫస్ట్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక పరుగుకే వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో అతను బ్యాటింగ్‌కు వచ్చినా అప్పటికే జట్టు చేయాల్సిన పరుగులు తక్కువగా ఉండటంతో రెండో ఇన్నింగ్స్‌లోనూ ఒక పరుగుకే పరిమితమయ్యాడు.

 అశ్విన్ స్మార్ట్‌గా బౌలింగ్ చేశాడు..

అశ్విన్ స్మార్ట్‌గా బౌలింగ్ చేశాడు..

అశ్విన్ చేతిలో ఔటవ్వడంపై స్పందిస్తూ.. ‘అడిలైడ్ టెస్టులో నేను ఔట్ అవ్వకముందు వరుసగా రెండు బంతులు టర్న్ అయ్యాయి. కానీ ఔటైన బంతిలో మాత్రం ఎలాంటి టర్న్ కనిపించలేదు. నేను ఆ బంతిని సమర్థంగా ఎదుర్కోలేకపోయాను. అశ్విన్ తెలివిగా బౌలింగ్ చేశాడు. భారత్, ఆస్ట్రేలియా పిచ్‌లు భిన్నంగా ఉంటాయి. భారత్‌లో బంతి టర్న్ అయినట్లు ఆస్ట్రేలియాలో కాదు. అయినా అశ్విన్ నాపై పైచేయి సాధించాడు. మెల్‌బోర్న్ టెస్టుకి ఆ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటా. తప్పకుండా అశ్విన్‌ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తా' అని స్టీవ్ ‌స్మిత్ తెలిపాడు.

Story first published: Tuesday, December 22, 2020, 20:36 [IST]
Other articles published on Dec 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+