ఇండోర్: శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ అసాధారణ బ్యాటింగ్‌తో తమ ఓటమిని శాసించారని ఆస్ట్రేలియా తాత్కలిక సారథి స్టీవ్ స్మిత్(Steve Smith) అన్నాడు. ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా డక్ వర్త్ లూయిస్ పద్దతిన 99 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన స్మిత్.. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న వికెట్‌పై భారత బ్యాటర్లంతా సత్తా చాటారని కొనియాడాడు.
'మేం ఇక్కడికి వచ్చినప్పుడు పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండేలా కనిపించింది. టీమిండియా గెలుపు క్రెడెట్ శుభ్‌మన్ గిల్(Shubman Gill), శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)లదే. అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను మా నుంచి లాగేసారు. సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ ఆడిన తీరు అయితే అమోఘం. వర్షం అనంతరం పిచ్ స్పిన్‌కు అనుకూలించింది. దాంతో మా బ్యాటర్లు విఫలమయ్యారు.

వరుసగా గత కొన్ని మ్యాచ్‌ల్లో మేం ఓటమిపాలయ్యాం. మా తప్పిదాలను సవరించుకోవాల్సిన అవసరం ఉంది. తదుపరి మ్యాచ్‌లో సత్తా చాటుతామని ఆశిస్తున్నా. మూడో వన్డేకు కొన్ని రోజుల టైమ్ ఉంది. ఇరు జట్లు ప్రపంచకప్ సన్నాహకంగా ఈ సిరీస్‌ను వాడుకుంటున్నాయి. చివరి వన్డేలో విజయం సాధిస్తామని ఆశిస్తున్నా.'అని స్టీవ్ స్మిత్(Steve Smith) చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 399 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభ్‌మన్ గిల్(97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 104), శ్రేయస్ అయ్యర్(90 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 105) సెంచరీలతో చెలరేగారు. సూర్యకుమార్ యాదవ్ (37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 72 నాటౌట్) సునామీ ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ రాహుల్(38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో రాణించాడు.
ఆసీస్ బౌలర్లలో కామెరూన్ గ్రీన్ 2 వికెట్లు తీయగా.. ఆడమ్ జంపా, జోష్ హజెల్ వుడ్, సీన్ అబాట్ తలో వికెట్ తీసారు. భారత బ్యాటర్ల ధాటికి ఆసీస్ బౌలర్లు పోటాపడి పరుగులు సమర్పించుకున్నారు. గ్రీన్ అయితే 103 పరుగులు ఇచ్చుకున్నాడు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలో 217 పరుగులకు కుప్పకూలింది. డేవిడ్ వార్నర్(39 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 53), సీన్ అబాట్(36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ షమీకి ఓ వికెట్ దక్కింది.
400 పరుగుల భారీ లక్ష్యచేదనకు దిగిన ఆసీస్ ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఆటను కుదించారు. డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఆసీస్‌కు 33 ఓవర్లలో 317 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ విజయంతో మరో మ్యాచ్‌తో సంబంధం లేకుండానే 2-0తో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరగనుంది.