'అశ్విన్ నాపై పైచేయి సాధించాడు.. తెలివిగా నన్ను బోల్తా కొట్టించాడు!! ఈసారి మాత్రం ఔట్ కాను'

మెల్‌బోర్న్: సుదీర్ఘ పర్యటనలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్ట్ మ్యాచుల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అడిలైడ్ వేదికగా డే/నైట్ టెస్ట్ ముగిసింది. డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా బాక్సింగ్‌డే టెస్టు ప్రారంభంకానుంది. అయితే భారత్‌పై మెరుగైన రికార్డ్ ఉన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ని తొలి టెస్టులో ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అలవోకగా బోల్తా కొట్టించాడు. స్మిత్‌పై అశ్విన్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు.

బంతిని టర్న్ చేయకుండా:
డే/నైట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 29 బంతులు ఎదుర్కోన్న స్టీవ్ స్మిత్ కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. రవిచంద్రన్ అశ్విన్ ఆఫ్ స్టంప్ లైన్‌పై విసిరిన బంతిని ముందుకు ఫుష్ చేయబోయి స్లిప్‌లో ఫీల్డర్ అజింక్య రహానే చేతికి చిక్కాడు. బంతిని టర్న్ చేయకుండా అశ్విన్ విసరగా.. స్మిత్ బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి స్లిప్‌లో గాల్లోకి లేచి రహానే చేతిలో పడింది. దీంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ఒక బంతిని ఎదుర్కొన్న స్మిత్.. నాటౌట్‌గా నిలిచాడు. ఆసీస్ విజయం సాదించడంతో స్మిత్ పెద్దగా కష్టపడల్సిన పనిలేకుండా పోయింది.

స్మిత్‌పై అశ్విన్ ఆధిపత్యం:
నిజానికి గత కొంతకాలంగా స్టీవ్ స్మిత్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఆసీస్ పర్యటనకు ముందు యూఏఈ వేదికగా ముగిసిన ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ ఎక్కువ ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో ఔటైన స్మిత్.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆడేటప్పుడు మాత్రం అశ్విన్‌కి వికెట్ సమర్పించున్నాడు. డే/నైట్ టెస్టులో కూడా స్పిన్ మాయాజాలానికి చిక్కాడు. ఇక శనివారం నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య మెల్‌బోర్న్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో.. అశ్విన్ బౌలింగ్‌లో వికెట్ చేజార్చుకోవడంపై స్మిత్ స్పందించాడు. అశ్విన్ తనపై పైచేయి సాధించాడన్నాడు.

అశ్విన్ తెలివిగా బౌలింగ్ చేశాడు:
'అడిలైడ్ టెస్టులో నేను ఔట్ అవ్వకముందు వరుసగా రెండు బంతులు టర్న్ అయ్యాయి. కానీ ఔటైన బంతిలో మాత్రం ఎలాంటి టర్న్ కనిపించలేదు. నేను ఆ బంతిని సమర్థంగా ఎదుర్కోలేకపోయాను. అశ్విన్ తెలివిగా బౌలింగ్ చేశాడు. భారత్, ఆస్ట్రేలియా పిచ్‌లు భిన్నంగా ఉంటాయి. భారత్‌లో బంతి టర్న్ అయినట్లు ఆస్ట్రేలియాలో కాదు. అయినా అశ్విన్ నాపై పైచేయి సాధించాడు. మెల్‌బోర్న్ టెస్టుకి ఆ తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటా. తప్పకుండా అశ్విన్‌ని ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తా' అని స్టీవ్ స్మిత్ తెలిపాడు. డే/నైట్ టెస్టులో స్మిత్ రెండు పరుగులు చేశాడు.

జడ్డూ కూడా జట్టులోకి వస్తే:
కంకషన్‌కు గురైన సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బాక్సింగ్ డే టెస్టులోపు మ్యాచ్ ఫిట్‌నెస్ సాధిస్తే.. హనుమ విహారి స్థానంలో ఆడనున్నాడు. జడ్డూ కూడా జట్టులోకి వస్తే మన స్పిన్ విభాగం పటిష్టం కానుంది. స్పిన్‌లో తేలిపోయే ఆస్ట్రేలియాకు కఠిన పరీక్ష ఎదురుకానుంది. ఇక పితృత్వ సెలవులపై విరాట్ కోహ్లీ భారత్‌కు తిరిగిరానున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి మూడు టెస్టులకు అజింక్య రహానే కెప్టెన్సీ బాధ్యతలు అందుకోనున్నాడు. పృథ్వీ షా విఫలమవుతుండటంతో ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్‌కు, కోహ్లీ గైర్హాజరీలో సూపర్ ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌కు అవకాశం దక్కనుంది.
ఫ్లాష్ న్యూస్: ముంబైలో సురేష్ రైనా అరెస్ట్.. సింగర్ గురు రంధవ కూడా!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications