
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడమే..
‘ఆస్ట్రేలియా క్రికెటర్‌గా ఎప్పుడూ యాషెస్ సిరీస్ గురించి మాట్లాడుతాం. అలాగే ప్రపంచకప్ కూడా మాకు ముఖ్యమే. కానీ టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియాను వారి సొంత గడ్డపై ఓడించాలనేది ప్రస్తుతం నాకున్న లక్ష్యం. అయితే అది అంత సులువు కాదన్న విషయం తెలుసు. ఇక క్రికెట్‌లో ఆటగాడిగా ఒకటి లేక అనేక లక్ష్యాలంటూ ఉండవు. రోజుకు రోజు, సిరీస్‌కు సిరీస్‌లో ఆటగాడిగా మెరుగుపడటంతో పాటు జట్టు గెలవాలని కోరుకుంటున్నా. యాషెస్, వరల్డ్‌కప్‌లతో సహా కొన్ని అవే వన్డే సిరీస్‌లకు ఇంకా చాలా సమయం ఉంది.

జడేజా బౌలింగ్ చాలా కష్టం..
ఇక ఉపఖండపు పిచ్‌లలో ముఖ్యంగా భారత్‌లో రవీంద్ర జడేజాను ఎదుర్కొవడం కష్టం. అతడు బంతిని రిలీజ్ చేసే తీరు ఒకే విధంగా ఉన్నా వైవిద్యభరితంగా దూసుకొస్తుంది. వేగంలో మార్పు లేకున్నా చేతివేళ్లతో బంతి గమనాన్ని మార్చుతాడు. అందుకే అతడి బౌలింగ్ ఆడటం కష్టంతో కూడుకున్నది.

నేను లెగ్ స్పిన్నర్‌నే..
నేను స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఆసీస్ జట్టులోకి వచ్చానని అతి కొద్ది మందికే తెలుసు. షేన్ వార్న్ తర్వాత మేనేజ్‌మెంట్ 12,13 మంది స్పిన్నర్లును ప్రయత్నించింది. అందులో నేనూ ఒకరిని. రెండు టెస్టులు ఆడిన తర్వాత జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాను. ఈ సమయంలో స్పిన్నర్‌గా వర్కౌట్ కాదని బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాను.'అని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు.

ఐపీఎల్ జరుగుతుంది..
ఈ ఏడాది ఐపీఎల్‌ను కచ్చితంగా నిర్వహిస్తారని ఈ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ప్రస్తుతం ప్రపంచం సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటోంది. అయితే ఈ ఏడాది ఏ సందర్భంలోనైనా ఐపీఎల్‌ను సాధ్యమైనంత వరకు నిర్వహిస్తారని ఆశిస్తున్నా. రాజస్థాన్ రాయల్స్‌కు రెండు సీజన్లలో నేను కొన్ని మ్యాచ్‌లకే కెప్టెన్సీ చేశాను. 2015లో షేన్ వాట్సన్ నుంచి బాధ్యతలు అందుకున్నా. ఆ తర్వాత గత సీజన్ ఆఖర్లోనూ కెప్టెన్సీ చేశాను. గొప్ప జట్టు అయిన రాజస్థాన్ రాయల్స్‌కు పూర్తి సీజన్ నాయకత్వం వహించాలని ఎదురుచూస్తున్నా'అని స్మిత్ తెలిపాడు.
ఇక కరోనా కారణంగా మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్‌ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. కానీ దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండటంతో ఐపీఎల్ నిర్వహణపై సందిగ్దత నెలకొంది.


Click it and Unblock the Notifications












