
ధాటిగా ఆడుతూ..
'మరింత సానుకూలంగా ఉండాలని నిర్ణయించుకున్నా. బౌలింగ్‌కు రాగానే అశ్విన్ తల మీదుగా షాట్లు ఆడాను. నాకిష్టమైన చోట బంతులు వేయించేలా అతనిపై ఒత్తిడి పెంచాను. వ్యూహం ఫలించినందుకు, పరుగులు చేసినందుకు ఆనందంగా ఉంది. స్పిన్నర్ల బౌలింగ్‌లోనే వేగంగా కదిలాను. పేసర్లను ఎప్పట్లాగే ఎదుర్కొన్నా. ఈ మ్యాచ్‌లో నేను కాస్త దూకుడుగా ఆడాను. ఆరంభంలో బంతికి ఒక పరుగు చొప్పున చేయడంతో మంచి ఇన్నింగ్స్‌ను నిర్మించాను' అని స్మిత్ చెప్పుకొచ్చాడు.

ఆ మాటలు వింటే నవ్వొచ్చింది..
మూడు వారాల క్రితమే సిడ్నీ మైదానంలో వరుస శతకాలు చేసిన తాను ఫామ్ కోల్పోయానని విమర్శించడం నవ్వు తెప్పించిందని స్మిత్ తెలిపాడు. కొంతమంది విమర్శించడమే పనిగా వ్యవహరిస్తారని, వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. 'తొలి రెండు టెస్టుల్లో పరుగులు చేయలేకపోయాను. మూడో టెస్టులో పుంజుకొని శతకం చేయడంతో జట్టు మెరుగైన స్థితిలోనే నిలిచిందని అనుకుంటున్నా. మేం మెరుగైన స్కోరే చేశాం. ఇంకొన్ని పరుగులు చేస్తే బాగుండేది. రెండోరోజు సాయంత్రం బౌలర్లు చక్కగా బంతులు విసిరి రెండు వికెట్లు తీశారు. రేపు ఏం జరుగుతుందో చూడాలి. సిడ్నీ నాకెంతో ప్రత్యేకమైన మైదానం. ఇక్కడ ఆడటాన్ని నేను ఆస్వాదిస్తాను' అని స్మిత్ చెప్పుకొచ్చాడు.

గబ్బాలో ఆడుతాం..
కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో నాలుగో టెస్ట్‌లో నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే క్వీన్స్‌లాండ్‌లో మూడు రోజుల లాక్‌డౌన్ విధించినా గబ్బాలో నాలుగో టెస్టు జరుగుతుందని స్మిత్ ధీమా వ్యక్తం చేశాడు. 'గబ్బాలో టీమిండియాతో తలపడటం మాకిష్టమే. నాకు తెలిసినంత వరకు మార్పులేమీ ఉండకపోవచ్చు. అయితే నిర్ణయం తీసుకొనేది మేం కాదు. బోర్డులు చెప్పిన చోటికి వెళ్లి ఆడటమే ఆటగాళ్ల పని. ఏదేమైనా గబ్బాలో ఆడటాన్ని మేం ఆస్వాదిస్తాం' అని స్మిత్ చెప్పుకొచ్చాడు. అయితే మరోసారి క్వారంటైన్‌లో ఉండేందుకు టీమిండియా ఇష్టపడటం లేదు. దాంతో సడలింపులు ఇవ్వాలని బీసీసీఐ.. క్రికెట్ ఆస్ట్రేలియాకు లేఖ రాసింది. కానీ క్విన్స్ లాండ్ ప్రభుత్వం మాత్రం రూల్స్ పాటించాల్సిందే అంటుంది.

ఆసీస్ భారీ స్కోర్..
ఇక 166/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్(131) సెంచరీతో చెలరేగగా.. మార్నస్ లబుషేన్(91) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. దాంతో ఆసీస్ భారీ స్కోర్ చేయగలిగింది. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు తీయగా.. నవ్‌దీప్ సైనీ, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది.


Click it and Unblock the Notifications
