హైదరాబాద్: పూణె వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడానికి మంచు కూడా ఓ కారణమని రైజింగ్ పుణె సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్‌స్మిత్ అన్నాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం స్టీవ్ స్మిత్ మీడియాతో మాట్లాడాడు. [కెప్టెన్‌గా 100వ మ్యాచ్: పూణె Vs కోల్‌కతా మ్యాచ్ హైలెట్స్]
'మ్యాచ్ సగం ముగిసిన తర్వాత మాది మంచి స్కోర్ అనుకున్నాను. పిచ్ మందకొడిగా ఉంది. అప్పుడే నెమ్మదిగా మంచు కురుడం మొదలైంది. వికెట్ వేగవంతం కావడంతో బ్యాటింగ్‌కు చాలా బాగా అనుకూలించింది. గంభీర్, ఉతప్ప చాలా చక్కగా, స్వేచ్ఛగా ఆడారు' అని అన్నాడు.
ఐపీఎల్ ప్రత్యేక వార్తలు | ఐపీఎల్ పాయింట్ల పట్టిక | ఐపీఎల్ 2017 ఫోటోలు
ఈ సీజన్‌లో క్యాచ్‌లు అందుకోవడంలో పూణె ఆటగాళ్లు దారుణంగా విఫలమవుతోందని స్మిత్ అన్నాడు. నాలుగు మ్యాచుల్లో ఏడు క్యాచ్‌లు వదిలేసిందని చెప్పాడు. దీంతో ఫీల్డింగ్ మెరుగు పరుచుకోవడంలో మరింత ప్రాక్టీస్ చేయాల్సి ఉందని స్టీవ్ స్మిత్ అన్నాడు.

పూణె వేదికగా బుధవారం రైజింగ్ పూణె సూపర్ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పూణె నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.
పూణె నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా నైట్‌రైడర్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి చేధించింది. కెప్టెన్ గౌతమ్ గంభీర్ (46 బంతుల్లో 62; 6 ఫోర్లు, ఒక సిక్సు), రాబిన్ ఉతప్ప (47 బంతుల్లో 87; 7 ఫోర్లు, 6 సిక్సులు) అర్ధ సెంచరీలతో చెలరేగారు.