Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కెప్టెన్‌గా 100వ మ్యాచ్: పూణె Vs కోల్‌కతా మ్యాచ్ హైలెట్స్

హైదరాబాద్: ఐపీఎల్‌ పదో సీజన్‌లో భాగంగా పూణె వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రైజింగ్‌ పుణె సూపర్‌ జెయింట్‌ భారీ స్కోరు చేసింది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ అర్ధ సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు కోల్పోయి 182 పరుగులు చేసింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పూణె ఓపెనర్లు రహానే (41 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), రాహుల్ త్రిపాఠి (23 బంతుల్లో 38; 7 ఫోర్లు) మంచి ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరి జోడి 65 పరుగుల జత చేసిన తరువాత త్రిపాఠి తొలి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. పియూష్ చావ్లా వేసిన 8వ ఓవర్‌ చివరి బంతికి త్రిపాఠి పెవిలియన్‌కు చేరాడు.

Steve Smith

అనంతరం క్రీజులోకి వచ్చిన స్టీవ్‌ స్మిత్‌, రహానేకు జత కలిసిన దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 47 పరుగులు జోడించారు. ఈ క్రమంలో అర్ధ సెంచరీకి చేరువలోకి వచ్చిన రహానె(46) నరైన్‌ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ధోనీ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.

కుల్దీప్‌ యాదవ్‌ వేసిన 18వ ఓవర్లో ధోని(11 బంతుల్లో 23; ఫోర్, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడబోయి మూడో వికెట్‌గా అవుటయ్యాడు. కాగా, ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో స్మిత్ (37 బంతుల్లో 51 నాటౌట్; 4 ఫోర్లు,1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, క్రిస్టియన్ (16) ఫర్వాలేదనిపించాడు. కోల్‌కతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీయగా ఉమేష్ యాదవ్, సునీల్ నరైన్, పియూష్ చావ్లా తలో వికెట్ తీసుకున్నారు.

పూణె Vs కోల్‌కతా మ్యాచ్ హైలెట్స్:

* కెప్టెన్‌గా గంభీర్‌కు ఇది 100వ ఐపీఎల్ మ్యాచ్.
* కోల్‌కతా జట్టుపై స్టీవ్ స్మిత్ తొలిసారిగా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
* ఇప్పటివరకు ఈ స్టేడియంలో కోల్ కతాకు 5-0 రికార్డు ఉంది.
* పూణ ఓపెనర్ రాహుల్ త్రిపాఠి 23 బంతుల్లో 38 పరుగులు చేశాడు.
* పూణె ఓపెనర్లు 65 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
* ఓపెనర్ రహానే 41 బంతుల్లో 46 పరుగులు చేశాడు.
* ఐపీఎల్ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో 3 స్టంపింగ్‌లు చేసిన రెండో వికెట్ కీపర్ రాబిన్ ఊతప్ప. అంతకముందు ధోని రెండు సార్లు ఇలా చేశాడు.
* ఐపీఎల్‌లో కుల్దీవ్ యాదవ్ వేసిన ఒకే ఓవర్‌లో రెండు స్టంపింగ్‌లు చేయబడ్డాయి. ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా నిలిచాడు.
* ఐపీఎల్ పదో సీజన్‌లో స్టీవ్ స్మిత్ రెండో అర్ధసెంచరీని నమోదు చేశాడు. 35 బంతుల్లో అర్ధసెంచరీని నమోదు చేశాడు.
* ఈ మ్యాచ్‌లో ధోని 11 బంతుల్లో 23 పరుగులు చేశాడు.
* పూణె బ్యాట్స్ మెన్ క్రిస్టియన్ 6 బంతుల్లో 16 పరుగులు చేశాడు.
* ఈ మ్యాచ్‌లో కుల్దీప్ 4-0-31-2తో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Read in English: IPL: Highlights: RPS Vs KKR
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+