
జడ్డూనే బెస్ట్ ఫీల్డర్..
ఈ క్రమంలో ఓ అభిమాని ‘స్మిత్ నీ దృష్టిలో బెస్ట్ ఫీల్డర్ ఎవరు'అని ప్రశ్నించాడు. దీనికి స్మిత్.. భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పేరును సూచించాడు. ఇక భారత మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ గురించి ఒక్క మాటలో చెప్పమంటే.. లెజెండ్, మిస్టర్ కూల్ అని ఈ ఆసీస్ స్టార్ బదులిచ్చాడు. బాగా ఆకట్టుకునే ఆటగాడెవరని ప్రశ్నించగా.. ఆశ్చర్యకరంగా స్మిత్ కేఎల్ రాహుల్ పేరును సూచించాడు.

కోహ్లీ సైతం..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా జడేజానే అద్భుతమైన ఫీల్డర్ అని స్పష్టం చేశాడు. ఆ మధ్య స్టార్‌స్పోర్ట్స్ ఇండియా తన అధికారికి ట్విటర్ ఖాతాలో టీమిండియా బెస్ట్ ఫీల్డర్ ఎవరనే దానిపై ఓ పోల్ పెట్టింది. 'ఒకవేళ మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఒకే షాట్‌లో స్టంప్స్ కొట్టాలంటే.. అప్పుడు జడేజా, విరాట్‌లో ఎవరిని ఎంచుకుంటారు?'అని ప్రశ్నించింది. దీనికి అభిమానులు తమకుతోచిన సమాధానం చెప్పారు. కొందరు జడేజా పేరు చెప్పగా.. మరికొందరూ విరాట్ పేరు సూచించారు. అయితే ఈ క్వశ్చన్ పోల్ చూసిన భారత కెప్టెన్ మాత్రం జడేజా పేరును సూచించాడు. 'ఎవరైనా జడేజానే ఎంపికచేసుకుంటారు. ఎప్పుడైనా అతనే బెస్ట్ ఫీల్డర్.. ఇక ఈ చర్చను ఆపండి' అని సమాధానమిచ్చాడు.
ఆసీస్ మాజీ దిగ్గజం బ్రాడ్ హగ్ కూడా బెస్ట్ ఫీల్డర్ జడేజేనని తెలిపాడు.

రోహిత్ మాత్రం..
టీమిండియా లిమిటెడ్ ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ పేరు చెప్పి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఆదివారం ఓ అభిమాని రోహిత్ బెస్ట్ ఫీల్డర్ ఎవరని ప్రశ్నించగా అతని పేరు చెప్పాడు. దీంతో భారత అభిమానులు రోహిత్ శర్మపై సెటైర్లు పేలుస్తున్నారు. సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీలో ఎవరో ఒకరి పేరు చెప్పొచ్చు కదా? అని అంటున్నారు. మరికొందరు మాత్రం రోహిత్ నిజాయతీగా తన అభిప్రాయం చెప్పాడని ప్రశంసిస్తున్నారు.

జడేజానే బెస్ట్ ..
వాస్తవానికి మార్టిన్ గప్తిల్‌తో పోలిస్తే రవీంద్ర జడేజానే అత్యుత్తమ ఫీల్డర్. ఎక్కువగా పాయింట్ రీజిన్‌లో ఫీల్డింగ్ చేసే జడేజా.. బంతిని చాకచక్యంగా అందుకోవడంతో పాటు గురితప్పకుండా వికెట్లను కొట్టగలడు. పాయింట్‌లో ఫీల్డింగ్ చేసే ఆటగాడికి సాధారణంగా మూడు స్టంప్‌లు కనబడవు.. మూడూ ఒకే స్టంప్‌లా కనిపిస్తాయి. కానీ.. జడేజా త్రో మాత్రం మిస్ అవడం చాలా అరుదు. అందుకే జడేజా చేతిలో బంతి ఉంటే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పరుగు కోసం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంటారు.


Click it and Unblock the Notifications












