Steve Smith: గాయం తగ్గకుంటే టీ20 ప్రపంచకప్ ఆడను.. యాషెస్ సిరీసే నా ప్రధాన లక్ష్యం!

సిడ్నీ: పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించకుంటే యూఏఈ వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్ నుంచి తప్పుకుంటానని ఆస్ట్రేలియా వెటరన్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. యాషెస్ సిరీస్‌కు పూర్తిస్థాయిలో సన్నదమవ్వడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నాడు. ప్రస్తుతం టెన్నిస్ ఎల్బో గాయం నుంచి కోలుకుంటున్న స్మిత్.. ఆస్ట్రేలియా టీమ్ వెస్టిండీస్, బంగ్లాదేశ్ పర్యటనల నుంచి కూడా తప్పుకున్నాడు.
ఇక భారత్ వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్ యూఏఈకి తరలిన విషయం తెలిసిందే. ప్రస్తుతమైతే ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ప్రకటించకపోయినప్పటికీ.. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 మధ్య జరిగే అవకాశం ఉంది. ఈ మెగా టోర్నీ అనంతరం ఆస్ట్రేలియా అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్ట్ సిరీస్‌తో పాటు డిసెంబర్ 8 నుంచి యాషెస్ సిరీస్ ఆడనుంది.

యాషెస్ నా ప్రధాన లక్ష్యం..
ఈ క్రమంలోనే తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్‌సైట్ క్రికెట్.కామ్. ఏయూకి తన గాయం రిహాబిలిటేషన్‌కు సంబంధించిన వివరాలను స్మిత్ వెల్లడించాడు.'టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనడం నాకు ఇష్టమే. కానీ నా దృష్టిలో టెస్ట్ క్రికెట్ అంత కంటే ఎక్కువ. ఇక నా ప్రధాన లక్ష్యం యాషెస్ సిరీస్. గత కొన్నేళ్లుగా యాషెస్ సిరీస్‌లో చేసింది పునరావృతం చేయాల్సిన బాధ్యత నాపై ఉంది.'అని స్మిత్ తెలిపాడు. గత మూడు యాషెస్ సిరీస్‌లో ఈ వరల్డ్ నెంబర్ 2 బ్యాట్స్‌మన్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. మొత్తం 14 మ్యాచ్‌ల్లో 93.76 సగటుతో 1969 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలున్నాయి.

టీ20 ప్రపంచకప్ ఆడను..
ఈ క్రమంలోనే మళ్లీ యాషెస్ సిరీస్‌లో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చాలని స్మిత్ భావిస్తున్నాడు. ఇందుకోసం అవసరమైతే టీ20 ప్రపంచకప్‌కు దూరంగా ఉంటానని కూడా చెప్పుకొచ్చాడు. 'గత యాషెస్ సిరీస్‌లో చూపించిన ప్రభావాన్ని చూపగల స్థితిలో నన్ను నేను ఫిట్‌గా ఉంచాలనుకుంటున్నాను. అవసరమైతే టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరంగా ఉంటాను. అయితే మెగా టోర్నీకి చాలా సమయం ఉన్నందున ఆ అవసరం రాదనే ఆశాభావంతో ఉన్నాను'అని స్మిత్ చెప్పుకొచ్చాడు.

గతేడాది గ్రిప్ మార్చడంతో..
తన గాయం గురించి మాట్లాడుతూ..'గతేడాది సమ్మర్‌లో నా బ్యాటింగ్ గ్రిప్ మార్చిన తర్వాత ఎడమ మణికట్టులో చిన్నగా నొప్పి మొదలైంది. తరువాతి సీజన్‌కు ఆ నొప్పి మెల్లగా నా మోచేతిలోకి వచ్చింది. దాంతో డొమెస్టిక్ క్రికెట్‌కు కొంత కాలం బ్రేక్ ఇచ్చాను. సరిగ్గా ఐపీఎల్‌కు ముందు న్యూ సౌత్ వేల్స్ తరఫున 50 ఓవర్ల ఫార్మాట్ మ్యాచ్ ఆడను. ఐపీఎల్ సమయంలోనూ పూర్తిగా ఫిట్‌లేను. చాలా నొప్పితోనే బ్యాటింగ్ చేశాను. బ్యాటింగ్ చేసిన ప్రతీసారి పెయిన్ కిల్లర్స్, యాంటి ఇన్‌ఫ్లేమటరీస్‌లను తీసుకునేవాడిని. కానీ ఆ తర్వాత నొప్పి ఎక్కువవ్వడంతో గాయం తగ్గలేదని గ్రహించాను.'అని స్మిత్ చెప్పుకొచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున స్మిత్ 6 మ్యాచ్‌లు ఆడిన విషయం తెలిసిందే.
గతంలో ఇదే తరహా గాయంతో బాధపడిన మాజీ క్రికెటర్లు బ్రాడ్ హడిన్, పీటర్ నెవిల్, కామెరూన్ వైట్ సలహాలు, సూచననలు తీసుకున్నానని, ఓ దశలో ప్లాస్మా ఇంజెక్షన్ తీసుకునేందుకు సిద్దమయ్యానని కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తన గాయం మెరుగైందని, 10 నిమిషాల పాటు బ్యాటింగ్ కూడా చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications