For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అశ్విన్ కాదు.. అతని బౌలింగే మాకు భయం: స్టీవ్ స్మిత్

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ప్రశంసల జల్లు కురిపించాడు. బుమ్రా అత్యుత్తమ ఆల్ ఫార్మాట్ బౌలర్ అని, ఎలాంటి కండిషన్స్‌లోనైనా బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలని చెప్పాడు. అప్‌కమింగ్ బోర్డర్ గవాస్కర్ 2024 సిరీస్‌లో బుమ్రాను ఎదుర్కోవడం తమకు అదిపెద్ద సవాల్ అని అభిప్రాయపడ్డాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 22 నుంచి ఆసీస్ గడ్డపై ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఆసీస్ గడ్డపై జరిగిన గత రెండు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటుంది. పెర్త్ వేదికగా నవంబర్ 22న ప్రారంభమయ్యే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.

Steve Smith Hails Jasprit Bumrah Ahead Of Border-Gavaskar Trophy 2024

ఈ సిరీస్‌లో భారత్ విజయం సాధించాలంటే జస్‌ప్రీత్ బుమ్రా రాణించడం చాలా కీలకం. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌‌ ఛానెల్‌లో మాట్లాడిన స్మిత్.. బుమ్రా గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు.

'జస్‌ప్రీత్ బుమ్రా అసాధారణమైన బౌలర్. కొత్త, పాత బంతి అనే తేడా లేకుండా బుమ్రా చెలరేగుతాడు. ఆ నైపుణ్యం అతనికి ఉంది. మూడు ఫార్మాట్లలో అతనే అత్యుత్తమ బౌలర్. బుమ్రాను ఎదుర్కోవడం ఎప్పటికీ అతిపెద్ద సవాలే.'అని స్మిత్ చెప్పుకొచ్చాడు.

మిడిలార్డర్‌లో ఆడే స్మిత్.. గత రెండు సిరీస్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. భారత్‌తో సిరీస్‌లో కూడా అతను ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అయితే ఓపెనర్‌గా అతనికి మెరుగైన రికార్డులు లేవు. నాలుగు మ్యాచ్‌ల్లో ఓపెనింగ్ చేసిన స్మిత్ ఓ హాఫ్ సెంచరీతో 171 పరుగులు మాత్రమే చేశాడు.

ఇప్పటి వరకు 109 టెస్ట్‌లు ఆడిన స్మిత్ 10 వేల పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం అతను 56.97 సగటుతో 9685 పరుగులు చేశాడు. 2018లో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన బుమ్రా.. 37 మ్యాచ్‌ల్లో 20.51 సగటుతో 164 వికెట్లు తీసాడు. బుమ్రా బౌలింగ్‌లో ఇప్పటి వరకు 114 బంతులు ఎదుర్కొన్న స్మిత్ 52 పరుగులు చేసి ఒకసారి ఔటయ్యాడు. గతంలో బుమ్రా బౌలింగ్‌ను స్మిత్ సమర్థవంతంగా ఆడాడు.

Story first published: Monday, September 23, 2024, 18:26 [IST]
Other articles published on Sep 23, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+