Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: హమ్మయ్యా.. స్టీవ్ స్మిత్ అయితే ఔటయ్యిండు!

Steve Smith Got Out On 1 Run To Ashwin Lowest Score against India

అడిలైడ్: భారత్, ఆస్ట్రేలియా మధ్య డే/నైట్ టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి రోజు బౌలర్ల ఆధిపత్యాన్ని కొంత భారత బ్యాట్స్‌మెన్ అడ్డుకోగా.. రెండో రోజు మాత్రం బౌలర్ల జోరే కొనసాగుతుంది. ఆరంభంలోనే చెలరేగిన ఆసీస్ బౌలర్లు 25 బంతుల వ్యవధిలోనే భారత్‌ను ఆలౌట్ చేయగా.. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ కూడా భారత బౌలర్ల ధాటికి మూడు వికెట్లు కోల్పోయింది. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై ఆసీస్ ఎంత జాగ్రత్తపడినా వికెట్లను కాపాడుకోలేకపోయింది.

భారత బౌలర్లను ఆసీస్ ఓపెనర్లు ఎంత జాగ్రత్తగా ఆడారంటే.. ఆరంభంలోని మూడు ఓవర్లను మెయిడిన్ చేశారు. అయినా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ఓపెనర్లు మాధ్యూ వేడ్(8), జో బర్న్స్‌లను బుమ్రా పెవిలియన్ చేర్చగా.. కీలక స్టీవ్ స్మిత్‌(1)ను అశ్విన్ ఔట్ చేశాడు. అనంతరం ట్రావిస్ హెడ్‌(7)ను కూడా ఔట్ చేయడంతో ఆసీస్ 65 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. క్రీజులో లబుషేన్(38 బ్యాటింగ్), ట్రావిస్ హెడ్(1 బ్యాటింగ్) ఉన్నారు.

ఇక నిలకడకు మారుపేరైన స్టీవ్ స్మిత్(29 బంతుల్లో 1) స్వల్ప స్కోర్‌కే పెవిలియన్ చేర్చడం భారత్ శిభిరంలో ఉత్సాహాన్ని నింపింది. అంతకు ముందు లబుషేన్‌కు పలు అవకాశాలిచ్చిన భారత్ ఫీల్డర్లు.. స్మిత్ వికెట్‌తో ఊపిరి పీల్చుకున్నారు. భారత్‌పై ఎంతో ఘన రికార్డు ఉన్న స్మిత్ ఇలా స్వల్ప స్కోర్‌కే వెనుదిరగడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు భారత్‌తో 11 మ్యాచ్‌లు ఆడిన స్మిత్ 84.12 సగటుతో 1430 పరుగులు చేశాడు. ఇక ఆసీస్ గడ్డపై భారత్‌తో చివరి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 133, 192, 14, 117, 71 పరుగులు చేసిన స్మిత్.. తాజా ఇన్నింగ్స్‌ల్లో ఒక్క పరుగుకే పరిమితమయ్యాడు. ఈ ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు సార్లు హాఫ్ సెంచరీకిపై పరుగులు చేసిన స్మిత్ ఓ రెండింటిలో మాత్రం 14, 1 పరుగులే చేశాడు.

ఇక స్టార్క్, కమిన్స్ ధాటికి ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారత్ 244 పరుగులకే పరిమితమైన విషయం తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీ (180 బంతుల్లో 74; 8 ఫోర్లు) భారత ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. పుజారా (160 బంతుల్లో 43; 2 ఫోర్లు), రహానే (92 బంతుల్లో 42; 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు.

Story first published: Friday, December 18, 2020, 13:23 [IST]
Other articles published on Dec 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+