
ఆటగాడిగా ఏడాది.. కెప్టెన్‌గా రెండేళ్లు..
రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్ ట్యాంపరింగ్‌కు యత్నించి స్మిత్, డేవిడ్ వార్నర్, బెన్‌క్రాఫ్ట్ అడ్డంగా దొరికిపోయి యావత్ క్రికెట్ ప్రపంచ ముందు దోషులుగా నిలబడిన విషయం తెలిసిందే. సూత్రదారి డేవిడ్ వార్నర్, బెన్‌క్రాఫ్ట్ అయినా.. ఈ తప్పుడు చర్యను కెప్టెన్‌గా ప్రోత్సహించినందుకు స్మిత్ కూడా శిక్షార్హుడయ్యాడు. ముగ్గురు తమ తప్పిదం ఒప్పుకోవడం క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకుంది.

వరల్డ్‌కప్ రీఎంట్రీ..యాషెస్‌తో సత్తా..
గతేడాది వన్డే వరల్డ్ కప్‌తో వార్నర్, స్మిత్ అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. ఇక స్మిత్ యాషెస్ సిరీస్‌లో తన అద్భుత బ్యాటింగ్‌తో తాను ఎంత విలువైన ఆటగాడినో అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు.

క్రికెట్ ఆస్ట్రేలియాదే తుది నిర్ణయం..
ఇక స్మిత్‌ను కెప్టెన్‌గా నియమించడమే ఆలస్యం. మరి స్మిత్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తారో.. మరి కొంతకాలం వేచి చూస్తారా అనేది సీఏ యాజమాన్యం ఆలోచనపైనే ఆధారపడి వుంటుంది. ప్రస్తుతం ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా అరోన్ ఫించ్ ఉండగా, టెస్టు కెప్టెన్‌గా టిమ్ పైన్ కొనసాగుతున్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఫించ్‌ను తప్పించాలనే ఆలోచనలో సీఏ లేదు. అలాగే పైన్ కూడా టెస్టుల్లో కొనసాగించాలనే చూస్తోంది. వీరిద్దరి కెప్టెన్సీపై కోచ్ జస్టిన్ లాంగర్ ఇటీవల ప్రశంసలు కురిపించాడు.

అదనపు భారం ఇవ్వకపోవచ్చు..
ప్రత్యేకంగా టిమ్ పైన్ నాయకత్వ లక్షణాలు అమోఘం అంటూ కొనియాడాడు. అదే సమయంలో స్మిత్‌కు అదనపు భారాన్ని ఇవ్వడం కూడా ఆసీస్ క్రికెట్ పెద్దలకు ఇష్టం లేదు. కెప్టెన్‌గా స్మిత్ సమర్థుడైనప్పటికీ ఆ బాధ్యతలు అప్పచెప్పి బ్యాటింగ్‌పై ఒత్తిడి తీసుకురాకూడదనేది సీఏ యోచన. రాబోవు సిరీస్‌ల్లో పైన్, ఫించ్‌లు కెప్టెన్‌లుగా విఫలమైతే మాత్రం మళ్లీ స్మిత్‌నే సారథిగా చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












