Sydney Test: విరాట్ కోహ్లీ సరసన స్టీవ్ స్మిత్.. దిగ్గజాలతో మరో అరుదైన ఘనత!!

సిడ్నీ: టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ (131; 226 బంతుల్లో 16 ఫోర్లు) సెంచరీ చేశాడు. అడిలైడ్, మెల్‌బోర్న్ టెస్టుల్లో విఫలమైన స్మిత్.. సిడ్నీలో మాత్రం ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడుతూ సుదీర్ఘ ఫార్మాట్‌లో 27వ శతకం సాధించాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాట్స్‌మెన్ జాబితాలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సరసన స్మిత్ నిలిచాడు. అంతేకాదు టెస్టు పరుగుల్లో కూడా కోహ్లీని అధిగమించాడు.

కోహ్లీ సరసన స్మిత్
అంతర్జాతీయ కెరీర్‌లో 70 శతకాలు చేసిన విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో 27 సెంచరీలతో ఉన్నాడు. స్టీవ్ స్మిత్ కూడా టెస్టుల్లో 27 సెంచరీలు బాదాడు. ఇంకో శతకం బాదితే దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ హషీమ్ ఆమ్లా, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌ల సరసన నిలుస్తాడు. వీరిద్దరూ 28 శతకాలు సాధించారు. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 51 శతకాలతో అందరికన్నా ముందున్న సంగతి తెలిసిందే. అతడిని అందుకోవడం దాదాపు అసాధ్యమే. ఇక టెస్టు పరుగుల్లో కోహ్లీని స్మిత్ అధిగమించాడు. విరాట్ ఇప్పటివరకూ 7318 టెస్టు పరుగులు సాధిస్తే.. స్మిత్ 7368 పరుగులతో కొనసాగుతున్నాడు.

స్మిత్ మరో ఘనత
టీమిండియాపై అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన జాబితాలో కూడా స్టీవ్ స్మిత్ స్థానం సంపాదించాడు. ఇది స్మిత్‌కు టీమిండియాపై ఎనిమిదో టెస్టు సెంచరీగా నమోదైంది. అంతకుముందు గ్యారీ సోబర్స్, వివ్ రిచర్డ్, రికీ పాంటింగ్ మాత్రమే భారత్‌పై ఎనిమిదేసి టెస్టు శతకాలు సాధించినవారు. అయితే స్మిత్ 25 ఇన్నింగ్స్‌లలోనే 8 సెంచరీలు బాదడం విశేషం. సోబర్స్ (30), రిచర్డ్స్ (41), పాంటింగ్ (51) ఇన్నింగ్స్‌లలో 8 సెంచరీలు చేశారు.

టెస్టుల్లో 27వ శతకం
పేసర్ నవదీప్ సైనీ వేసిన 97వ ఓవర్ చివరి బంతికి మూడు పరుగులు తీసిన స్టీవ్ స్మిత్.. కెరీర్‌లో 27వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 2019 సెప్టెంబర్‌లో ఈ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ చివరిసారి ద్విశతకం బాదాడు. అప్పుడు మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో తలపడిన మ్యాచ్‌లో 211 పరుగులు చేశాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో అడిలైడ్‌లో(1, 1*), మెల్‌బోర్న్‌లో (0, 8) విఫలమైన సంగతి తెలిసిందే.

కడవరకూ క్రీజ్‌లో ఉండి
166/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ మరో 172 పరుగులు చేసి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ ఆటగాళ్లు లబూషేన్ సెంచరీ కోల్పోగా, స్టీవ్ స్మిత్ సెంచరీ సాధించాడు. స్మిత్ కడవరకూ క్రీజ్‌లో ఉండి స్కోరును చక్కదిద్దాడు. ఈ రోజు ఆటలో టీమిండియా బౌలింగ్‌లో రాణించినా స్మిత్ మాత్రం శతకంతో ఆకట్టుకోవడంతో ఆసీస్ తేరుకుంది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టాడు.
Sydney Test: నిలకడగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు.. గిల్ సూపర్!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications