For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చరిత్ర సృష్టించిన స్టీవ్ స్మిత్.. సచిన్‌కు సాధ్యం కాని వరల్డ్ రికార్డ్ సొంతం!

ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మరే క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డ్‌ను సాధించాడు. టెస్ట్‌ క్రికెట్‌లో 10 వేల పరుగుల మైలు దాటి ఈ వరల్డ్ రికార్డ్‌ను అందుకున్నాడు. టెస్ట్‌ల్లో 10 వేల పరుగులు.. వన్డేల్లో 5వేల పరుగులు.. టీ20ల్లో 1000 కంటే ఎక్కువ పరుగులు చేయడంతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో 50కి పైగా వికెట్లు తీసిన ఏకైక ఆటగాడిగా స్టీవ్ స్మిత్ చరిత్రకెక్కాడు.

శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ ద్వారా స్మిత్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్‌లో స్మిత్(104 బ్యాటింగ్) అజేయ శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో చేసిన తొలి పరుగుతోనే అతను 10 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.

Steve Smith Creates unique World Record after he completed 10000 runs in Test cricket

భారత్‌తో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే అతను ఈ ఫీట్ సాధించాల్సి ఉండగా.. సిడ్నీ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే వెనుదిరిగాడు. దాంతో 9,999 పరుగుల వద్ద నిలిచిపోయాడు. శ్రీలకంతో జరుగుతున్న మ్యాచ్‌లో 10 వేల పరుగుల మైలురాయితో పాటు 35వ టెస్ట్ శతకాన్ని అందుకున్నాడు. గతంలో ఆస్ట్రేలియా తరఫున 10 వేల పరుగుల మైలురాయి దాటిన అలెన్ బోర్డర్, స్టీవ్ వా, రికీ పాంటింగ్‌ల సరసన నిలిచాడు. టెస్ట్‌ల్లో 10 వేల పరుగులు చేసిన నాలుగో ఆసీస్ ఆటగాడిగా.. 15వ అంతర్జాతీయ ప్లేయర్‌గా స్మిత్ గుర్తింపు పొందాడు.

అయితే స్మిత్‌లా మూడు ఫార్మాట్లలో 10 వేలు, 5 వేలు, 1000కి పైగా పరుగులతో పాటు 50 వికెట్లు తీసిన వారు లేరు. సంగక్కర, జయవర్దనే మూడు ఫార్మాట్లలో ఇలా పరుగులు చేసినా 50 వికెట్లు తీయలేదు. సచిన్ టెండూల్కర్ వికెట్లు తీసిన టీ20ల్లో 1000 పరుగులు సాధించలేదు. అతను ఒకే ఒక్క అంతర్జాతీయ టీ20 ఆడాడు. మరోవైపు రోహిత్, కోహ్లీ ఇంకా టెస్ట్‌ల్లో 10 వేల పరుగులు అందుకోలేదు. అంతేకాకుండా అంతర్జాతీయ క్రికెట్‌లో 50 వికెట్లు తీయలేదు. దాంతో ఈ ప్రత్యేకమైన రికార్డ్‌ స్మిత్ పేరిట నమోదైంది.

మ్యాచ్‌ల పరంగా అత్యంత వేగంగా 10 వేల పరుగుల మైలురాయిని నమోదు చేసిన రెండో బ్యాటర్‌గా కూడా స్మిత్ రికార్డ్ సాధించాడు. శ్రీలంక మాజీ బ్యాటర్ కుమార సంగక్కరతో సమంగా 115వ టెస్ట్‌లోనే స్మిత్ ఈ ఫీట్ సాధించగా.. బ్రియాన్ లారా మాత్రం 111వ టెస్ట్‌ల్లో ఈ మార్క్ దాటి అగ్రస్థానంలో ఉన్నాడు.

అంతర్జాతీయ టెస్ట్‌ల్లో పరుగుల జాబితాలో సచిన్ టెండూల్కర్ (15, 921) టాప్‌లో కొనసాగుతుండగా.. రికీ పాంటి(13,378), జాక్వస్ కలిస్(13,289), రాహుల్ ద్రవిడ్(13,288), జో రూట్(12, 972) టాప్-5లో ఉన్నారు. ఈ జాబితాలో స్మిత్(10,103) 14వ స్థానంలో ఉన్నాడు. మరో 20 పరుగులు చేస్తే గవాస్కర్‌ను అధిగమించనున్నాడు.

Story first published: Thursday, January 30, 2025, 8:49 [IST]
Other articles published on Jan 30, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+