Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs BAN: స్నీకో ఛీటింగ్‌పై దుమారం.. స్మిత్ ఏమన్నాడంటే?

ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో స్నీకో వివాదం తీవ్ర దుమారం రేపింది. టెక్నాలజీ సాయంతో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.

రెండు టెస్ట్‌ల సిరీస్‌‌లో భాగంగా గురువారం డార్విన్ వేదికగా ప్రారంభమైన తొలి టెస్ట్‌ తొలి రోజు ఆటలో బంగ్లాదేశ్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బంగ్లాదేశ్ యువ పేసర్ హసన్ మహ్ముద్(6/55) ఆరు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. స్టీవ్ స్మిత్ (109 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 71) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు.

IND vs SL: ధ్రువ్ జురెల్‌కు బదులు అతన్ని ఆడించండి: మహమ్మద్ కైఫ్

IND vs SL: ధ్రువ్ జురెల్‌కు బదులు అతన్ని ఆడించండి: మహమ్మద్ కైఫ్

బచాయించిన స్మిత్..

అయితే ఇన్నింగ్స్ ఆరంభంలోనే అతను ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. టెక్నాలజీ సాయంతో బచాయించాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 21వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎబాడోట్ హొస్సేన్ వేసిన ఈ ఓవర్‌ నాలుగో బంతి స్టీవ్ స్మిత్ బ్యాట్‌కు దగ్గరగా వెళ్తూ కీపర్ చేతిలో పడింది. దాంతో బంగ్లాదేశ్ ఆటగాళ్లు వికెట్ కోసం అప్పీల్ చేశారు.

Steve Smith Breaks Silence on Cheating Controversy After Snicko Drama vs Bangladesh in 1st Test
Photo Credit: X (twitter)

స్మిత్ కూడా ఔటేనని భావించి పెవిలియన్ వైపు నడిచాడు. కానీ అంపైర్ కుమార్ ధర్మసేన ఔటివ్వకపోవడంతో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో రివ్యూ తీసుకున్నాడు. అల్ట్రా ఎడ్జ్‌లో బంతి బ్యాట్‌కు తాకినట్లు స్పైక్ కనిపించలేదు. దాంతో స్మిత్ తిరిగి బ్యాటింగ్ చేపట్టాడు. అయితే ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. టెక్నాలజీలో లోపం ఉందని నెటిజన్లు ఆరోపించారు. ఆస్ట్రేలియా ఛీటింగ్ చేసిందని మండిపడ్డారు.

ఔటే అనుకున్నా..

తొలి రోజు ఆట అనంతరం మీడియా సమావేశంలో ఈ ఘటనపై స్మిత్ స్పందించాడు. తాను ఔటనే భావించానని, కానీ బంతి బ్యాట్‌కు తాకిందా? లేదా? అనే విషయంపై స్పష్టత లేదన్నాడు. 'నేను ఔటయ్యాననే భావించాను. నేను చాలా అదృష్టవంతుడిని. టెక్నాలజీనే నన్ను కాపాడింది. ఒకవేళ అంపైర్ ఔటిచ్చి ఉంటే నేను వెళ్లిపోయేవాడిని. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుంది. అయితే బంతి బ్యాట్‌కు తాకిందా? లేదా? అనే విషయాన్ని నేను కచ్చితంగా చెప్పలేను. కానీ బ్యాట్‌కు తాకినట్లు నాకు అనిపించింది.'అని స్మిత్ చెప్పుకొచ్చాడు.

AUS vs BAN: 23 ఏళ్ల తర్వాత తొలి టెస్ట్.. ఆస్ట్రేలియాను గడగడలాడించిన బంగ్లాదేశ్!

Also Read

AUS vs BAN: 23 ఏళ్ల తర్వాత తొలి టెస్ట్.. ఆస్ట్రేలియాను గడగడలాడించిన బంగ్లాదేశ్!

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 198 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ పేసర్ హసన్ మహ్ముద్(6/55) ఆరు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించగా.. టస్కిన్ అహ్మద్(2/55), ఎబాడన్ హోస్సేన్ (2/39) రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆసీస్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్(109 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 71) హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 24 ఓవర్లలో వికెట్ నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో తంజిద్ హసన్(32 బ్యాటింగ్), మోమినుల్ హక్(35 బ్యాటింగ్) ఉన్నారు.

Story first published: Thursday, August 13, 2026, 18:07 [IST]
Other articles published on Aug 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+