For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Steve Smith: ఇంగ్లండ్ అభిమానుల గూబ గూయ్‌ మనేలా..!

లార్డ్స్: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ దుమ్మురేపుతున్నాడు. తనకు నచ్చిన.. అచ్చొచ్చిన ఫార్మాట్‌లో సెంచరీల మోత మోగిస్తున్నాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ స్టీవ్ స్మిత్ శతకంతో చెలరేగాడు. 184 బంతుల్లో 15 ఫోర్లతో 110 పరుగులు చేసి జట్టు భారీ స్కోర్‌కు అందించాడు.

టెస్ట్ కెరీర్‌లో స్మిత్‌కు ఇది 32వ సెంచరీ కాగా.. అత్యంత వేగంగా ఈ ఘనతను అందుకున్న బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజం స్టీవ్ వా(32) సరసన నిలిచాడు. అత్యధిక సెంచరీలు బాదిన జాబితాలో సచిన్ టెండూల్కర్(51 శతకాలు) అగ్రస్థానంలో ఉండగా.. జాక్వస్ కల్లీస్(45), రికీ పాంటింగ్(41) స్మిత్ కన్నా ముందున్నారు. ఈ తరం క్రికెట్‌లో స్టీవ్ స్మిత్ టాప్‌లో ఉండటం విశేషం.

Steve Smith

భారత్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ బాదిన స్మిత్ అదే జోరును కొనసాగిస్తున్నాడు. సౌతాంప్టన్ వేదికగా జరిగిన యాషెస్ తొలి టెస్ట్‌లోనూ స్మిత్ విఫలమైనా.. లార్డ్స్‌లో సెంచరీ బాది ఇంగ్లండ్ బౌలర్ల పాలిట సింహ స్వప్నంగా మారాడు. ముఖ్యంగా ఆ జట్టు అభిమానులకు తన ఆటతో గూబ గూయ్‌మనిపిస్తున్నాడు.

స్మిత్ చెలరేగిన ప్రతీసారి ఇంగ్లండ్ ఆటగాళ్లు అతన్ని ఛీటర్ అంటూ అవమాన పరిచారు. 2019 యాషెస్ సిరీస్ సందర్భంగా కూడా బాల్ ట్యాంపరింగ్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ఇంగ్లండ్ అభిమానులు స్మిత్‌ను గేలి చేశారు. ఛీటర్ ఛీటర్ అంటూ ఘోరంగా అవమానించారు. కానీ స్మిత్ ఏనాడు వారి ఎగతాళికి రియాక్ట్ అవ్వలేదు. ఒక్కరిని కూడా పల్లెత్తు మాట అనలేదు. తన ఆటతోనే ఆ ట్రోలింగ్‌కు బదులిచ్చాడు.

కమ్‌బ్యాక్ మ్యాచ్‌లో 144, 142 పరుగులతో దుమ్మురేపాడు. తాజా యాషెస్ సిరీస్ సందర్భంగా కూడా ఇంగ్లండ్ అభిమానులు స్మిత్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. 'నువ్వు ఏడ్వడం చూస్తాం'అంటూ ఘాటుగా విమర్శించారు. కానీ స్మిత్ రెండో టెస్ట్‌లో సెంచరీతో చెలరేగాడు. తన ఆటతోనే ఇంగ్లండ్ అభిమానుల నోరు మూయించాడు. ఈ తరం అత్యుత్తమ బ్యాటర్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.

స్మిత్ సెంచరీకి ట్రావిస్ హెడ్(73 బంతుల్లో 14 ఫోర్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్, జోష్ టంగ్ మూడేసి వికెట్లు తీయగా.. జోరూట్ రెండు వికెట్లు పడగొట్టాడు. జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ తలో వికెట్ తీసారు.

Story first published: Thursday, June 29, 2023, 17:51 [IST]
Other articles published on Jun 29, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+