Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Pakistan మ్యాచ్ బొమ్మ అదిరింది.. టీ20 చరిత్రలోనే హయ్యెస్ట్ వ్యూస్!

Star Sports Says India vs Pakistan T20 World Cup Clash Most Viewed T20I Match

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దాదాపు రెండేళ్ల తర్వాత దాయాదుల మధ్య జరిగిన ఈ పోరును చూసేందుకు రెండు దేశాల అభిమానులు ఎగబడటంతో అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ట్ స్పోర్ట్స్ పంట పండింది. టీ20 చరిత్రలోనే ఈ మ్యాచ్ హయ్యెస్ట్ వ్యూస్ రాబట్టింది. రికార్డు స్థాయిలో 167 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. గతంలో 2016 టీ20 ప్రపంచకప్‌లో భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌కు 136 మిలియన్ల వ్యూస్ రాగా.. ఇప్పుడు ఆ రికార్డును భారత్-పాక్ మ్యాచ్‌ బ్రేక్ చేసింది.

ఈ వ్యూస్ లెక్కలను స్టార్ ఇండియానే తెలిపింది. టీ20 చరిత్రలో ఓ మ్యాచ్​ను ఇంతమంది వీక్షించడం ఇదే తొలిసారి అని పేర్కొంది.'అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేచిచూసిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 24న జరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఇరు జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్​కు రికార్డు స్థాయిలో 167 మిలియన్​ వ్యూస్ లభించాయి. గతంలో 2016 టీ20 ప్రపంచకప్​ సెమీఫైనల్స్​ మ్యాచ్​కు (టీమ్​ఇండియా-వెస్టిండీస్) 136 మిలియన్​ వ్యూస్​ వచ్చాయి," అని స్టార్​ ఇండియా తమ అధికారిక ప్రకటనలో తెలిపింది. మెగా టోర్నీ మొదలైనప్పటి నుంచి సెమీస్​ క్వాలిఫయర్స్​ వరకు అన్ని మ్యాచ్​లు కలిపి 238మిలియన్ల మంది వీక్షించినట్లు స్టార్ ఇండియా స్పష్టం చేసింది.

క్రికెట్ వ్యూయర్​షిప్​ను పెంచేందుకు మరింత కృషి చేస్తున్నట్లు స్టార్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. ఎన్నో అంచనాలతో టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగిన భారత జట్టు చెత్తాటతో కనీసం సెమీఫైనల్ చేరకుండానే నిష్క్రమించింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడిన జట్టు.. ఆ తర్వాత అఫ్గాన్, స్కాట్లాండ్, నమీబియా‌లపై భారీ విజయాలు సాధించి టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్ 2 నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ సెమీస్ చేరగా.. గ్రూప్-1 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా నాకౌట్‌కు అర్హత సాధించాయి.

అయితే భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించడంతో టీ20 ప్రపంచకప్ కళ తప్పినట్లైంది. టోర్నీపై భారత అభిమానుల ఆసక్తి తగ్గింది. ఇది స్టార్ స్పోర్ట్స్‌కు భారీ నష్టాలను తెచ్చిపెట్టనుంది. భారత్-పాక్ మ్యాచ్‌కు 5 నిమిషాల యాడ్‌కు రూ.25-30 లక్షల వసులూ చేసిన స్టార్ స్పోర్ట్స్.. భారత్ సెమీస్, ఫైనల్ చేరితే రెట్టింపు వసూలు చేయాలని భావించింది. కానీ ఆ ప్రణాళికలన్నీ బెడిసికొట్టాయి.

Story first published: Tuesday, November 9, 2021, 22:43 [IST]
Other articles published on Nov 9, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+