Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Test Team of the Year 2023: కోహ్లీకి దక్కని చోటు.. భారత్ నుంచి ముగ్గురే!

టెస్ట్ క్రికెట్‌లో ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ బెస్ట్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ సందర్భంగా ఈ అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్ వివరాలను వెల్లడించింది. ఈ సిరీస్‌కు అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తున్న స్టార్ స్పోర్ట్స్.. టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023లో భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక చేసింది.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ జట్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ‌తో పాటు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఈ అత్యుత్తమ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాది 8 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 12 ఇన్నింగ్స్‌ల్లో 45.41 సగటుతో 545 రన్స్ చేశాడు. ఇందులో 2 సెంచరీలతో పాటు 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Star Sports picks Test Team of the Year 2023: No Kohli, only 3 Indians to part of the XI

రోహిత్ శర్మ కంటే కోహ్లీనే ఎక్కువ పరుగులు చేసినా అతనికి ఈ బెస్ట్ ఎలెవన్‌లో స్టార్ స్పోర్ట్స్ చోటివ్వలేదు. విరాట్ కోహ్లీ 8 టెస్ట్‌ల్లో 59.10 సగటుతో 591 రన్స్ చేశాడు. ఇందులో 2 శతకాలతో పాటు ఓ హాఫ్ సెంచరీ ఉంది. రవిచంద్రన్ అశ్విన్ 7 మ్యాచ్‌ల్లో 40 వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా 7 మ్యాచ్‌ల్లో 33 వికెట్లు పడగొట్టాడు.

ఆస్ట్రేలియా నుంచి అత్యధికంగా నలుగురు ఆటగాళ్లు ఎంపికయ్యారు. ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్‌తో పాటు ప్యాట్ కమిన్స్ ఈ అత్యుత్తమ జట్టులో చోటు దక్కించుకున్నారు. న్యూజిలాండ్ నుంచి కేన్ విలియమ్సన్ ఒక్కడే ఎంపికవ్వగా.. ఇంగ్లండ్ నుంచి జానీ బెయిర్ స్టో, స్టువర్ట్ బ్రాడ్, జోరూట్ అవకాశాన్ని అందుకున్నారు. ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఉస్మాన్ ఖవాజా.. ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ 2023 టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.

ఓపెనర్లుగా ఉస్మాన్ ఖవాజా, రోహిత్ శర్మ‌లను ఎంపిక చేసిన స్టార్ స్పోర్ట్స్.. మిడిలార్డర్‌లో జోరూట్, కేన్ విలియమ్సన్, ట్రావిస్ హెడ్, జానీ బెయిర్ స్టోలకు అవకాశం కల్పించింది. స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఎంపికవ్వగా.. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, స్టువర్ట్ బ్రాడ్ పేసర్లుగా అవకాశాన్ని అందుకున్నారు.

స్టార్ స్పోర్ట్స్ అత్యుత్తమ టెస్ట్ టీమ్ 2023:

ఉస్మాన్ ఖవాజా, రోహిత్ శర్మ, జోరూట్, కేన్ విలియమ్సన్, ట్రావిస్ హెడ్, జానీ బెయిర్ స్టో, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, స్టువర్ట్ బ్రాడ్

Story first published: Tuesday, December 26, 2023, 17:24 [IST]
Other articles published on Dec 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+