
20 శాతం రెట్లు పెంచినా..
ఈ క్రమంలోనే ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ రేట్లను భారీగా పెంచేసింది. దాదాపు 20 శాతం రేట్లను పెంచి ఐపీఎల్ బజ్‌ను అడ్వాంటేజ్‌గా మార్చుకుంటుంది. రేట్లు పెంచినా కంపెనీలు ఐపీఎల్ స్పాన్సర్‌షిప్ కోసం ఎగబడుతున్నాయంట. ఇప్పటికే 10 కంపెనీలు ఒప్పందం కూడా కుదుర్చుకున్నాయని ఇన్‌సైడ్ స్పోర్ట్స్ వెబ్‌సైట్ పేర్కొంది. డీస్నీ స్టార్ నెట్ వర్క్ వివరాల ప్రకారం.. పెంచిన ధరలతోనే క్రెడ్, డ్రీమ్ 11, బైజూస్, టాటా, ఏషియన్ పెయింట్స్, స్పోటిఫై, మీషో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, కమ్లా పసంద్, పెప్సీ కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

రూ.90 నుంచి రూ.160 కోట్లు..
కో ప్రజెంటింగ్ పార్టనర్స్ నుంచి రూ.160 కోట్లు వసూలు చేస్తున్న స్టార్ స్పోర్ట్స్.. అసోసియేట్ స్పాన్సర్స్ నుంచి రూ.90 కోట్లు వసూలు చేస్తుంది. ఐపీఎల్ 2021లో కో ప్రజెంటింగ్ పార్టనర్స్ నుంచి రూ.130-140 కోట్లు, అసోసియేట్ స్పాన్సర్స్ నుంచి రూ. 60-65 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఈ లెక్కన స్టార్.. 20 శాతం రేట్లు పెంచింది. 'ఐపీఎల్ 2022 చాలా ప్రత్యేకం. 10 జట్లతో భారత్ వేదికగా జరగనుంది. అంతేకాకుండా లీగ్ సరికొత్త ఫార్మాట్‌లో కొత్త టీమ్స్‌తో ఆకట్టుకోనుంది. ఈ క్రమంలోనే మార్కెట్‌లో ఐపీఎల్ బజ్ నెలకొంది. దీన్ని స్టార్ స్పోర్ట్స్ ఎన్‌క్యాష్ చేసుకుంటుంది'అని ఓ మీడియా ఏజెన్సీ హెడ్ అన్నాడు.

ఎందుకంతా డిమాండ్ అంటే..?
ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో నిర్వహించిన మెగా వేలం ఇప్పటికే రికార్డులు సృష్టించింది. అసలు సిసల్ లీగ్ ముందు ఇది ట్రైలర్‌గా రికార్డు వ్యూయర్ షిప్ సాధించింది. బార్క్ డాటా ప్రకారం ఐపీఎల్ 2022 మెగా వేలాన్ని రెండు రోజుల పాటు సుమారు 50 మిలియన్ల మంది వీక్షించారు. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం మెగా వేలం టీవీ వ్యూయర్‌షిప్ 40 శాతం జంప్ అయ్యింది.
ఐపీఎల్ 2022 మెగా వేలం కోసం అభిమానులు 3.6 బిలియన్ నిమిషాలు వెచ్చించారు. 2018 మెగా వేలంలో నమోదైన 2.5 బిలియన్ నిమిషాలే ఇప్పటి వరకు రికార్డు కాగా.. తాజా మెగా ఆక్షన్ దాన్ని అధిగమించింది. డీస్నీ హాట్‌స్టార్‌లో సైతం 2.18 మిలియన్ల మంది వీక్షించారు. ఈ విషయాన్ని స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం కూడా ధృవీకరించింది.

రెండు గ్రూప్‌లుగా లీగ్ మ్యాచ్‌లు..
పది జట్లను ఐపీఎల్‌లో ఇంతకు ముందు ప్రదర్శనల ఆధారంగా పది జట్లను రెండు గ్రూప్‌లుగా విడదీశారు. గెలిచిన టైటిల్స్, ఫైనల్ చేరిన సందర్భాలను బట్టి ప్రతీ టీమ్‌కు ర్యాంక్ ఇచ్చారు. గ్రూప్‌ఏలో వరుసగా ముంబై ఇండియన్స్(5 టైటిల్స్), కేకేఆర్(2), రాజస్థాన్ (1టైటిల్), ఢిల్లీ(ఒకసారి ఫైనల్), లక్నోలను చేర్చారు. గ్రూప్ బిలో వరుసగా చెన్నై సూపర్ కింగ్స్(4 టైటిల్స్), హైదరాబాద్(1 టైటిల్), బెంగళూరు, పంజాబ్, గుజరాత్‌ను ఉంచారు.
ప్రతీ జట్టు తమ గ్రూప్‌లోని నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు, మరో గ్రూప్‌లోని ఒక జట్టుతో (గ్రూప్‌లో అదే స్థానంలో ఉన్న) రెండేసి మ్యాచ్ లు ఆడుతుంది. ఇవి 10 మ్యాచ్‌లు అవుతాయి. మరో గ్రూప్‌లోని మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. కలిసి మొత్తం 14 మ్యాచ్‌లు అవుతాయి. ఉదాహరణకు ముంబై ఇండియన్స్ 'ఎ' గ్రూప్‌లోని నాలుగు టీమ్‌లతో పాటు గ్రూప్ 'బి'లో అగ్రస్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌తో రెండు మ్యాచ్‌లలో తలపడుతుంది. మిగిలిన నాలుగు టీమ్‌లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది.


Click it and Unblock the Notifications












