స్టార్‌కు సొంతం..
ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్ వరకూ టీవీ ప్రసార హక్కుల కోసం బీసీసీఐకి రూ.23,575 కోట్లు చెల్లించేందుకు స్టార్ నెట్‌వర్క్ సిద్ధమవ్వగా..
డిజిటల్ రైట్స్‌ను అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.23,773 కోట్లు చెల్లించనుంది. ఆ సంస్థకు చెందిన వయాకామ్ ద్వారా భారత్‌తో పాటు విదేశాల్లో కూడా ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేయనుంది. అలాగే టైమ్స్ నెట్‌వర్క్ కూడా డిజిటల్ హక్కుల్లో భాగం దక్కించుకుంది.
మూడు రెట్లు అధికం..
2008లో ఐపీఎల్ ప్రారంభమవ్వగా.. అప్పుడు 9 ఏళ్ల ప్రసార హక్కుల అమ్మకం ద్వారా బీసీసీఐ 8,200 కోట్లు సొంతం చేసుకుంది. తర్వాత 2018-22 ఐదేళ్ల ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ 16,348 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ సారి ప్రసార హక్కులను నాలుగు విభాగాలుగా చేసి వేలం వేయడంతో బీసీసీఐ మూడు రెట్లు అధికంగా ఆర్జించింది. ఏకంగా 48,390 కోట్లు కొల్లగొట్టింది.

దిగ్గజ సంస్థలు తప్పుకున్నా..
వయాకామ్,డిస్నీ ప్లస్ హాట్ స్టార్, సోనీ పిక్చర్స్, జీ గ్రూప్, అమేజాన్, గూగుల్, స్కై స్పోర్ట్స్, ఫ్యాన్ కోడ్, ఎంఎక్స్ ప్లేయర్, సూపర్ స్పోర్ట్, ఫేస్‌బుక్, యాపిల్ వంటి కార్పొరేట్ దిగ్గజ కంపెనీలు... ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి... అయితే వయాకామ్, అమేజాన్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు, ఐపీఎల్ మీడియా బిడ్డింగ్ నుంచి తప్పుకోవడంతో బీసీసీఐకి నిరాశ తప్పదేమో అనుకున్నారంతా. అయితే స్టార్ స్పోర్స్, సోనీ నెట్‌వర్క్ కలిసి బిడ్డింగ్ పెంచుతూ పోయాయి.

ప్రత్యేక యాప్..
ఐపీఎల్ డిజిటల్ రైట్స్‌ని దక్కించుకున్న వయాకామ్ 18కి చెందిన వూట్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారం కానుందని ప్రచారం జరుగుతోంది. అయితే వాస్తవానికి ఐపీఎల్ ప్రసారాల కోసం ప్రత్యేకంగా ఓ యాప్‌ను త్వరగా తీసుకోరాబోతోంది వయాకామ్. అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, నెట్‌ఫ్లిక్స్ స్థాయిలో ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్, అందుకు ఐపీఎల్ ప్రసార హక్కుల విక్రయాలను వాడుకోనుంది. జియో టీవీ సేవలను ఉచితంగా అందిస్తున్న రిలయన్స్ నెట్‌వర్క్, కొత్తగా తీసుకురాబోయే ఓటీటీ యాప్‌కి మాత్రం భారీగా ఛార్జ్ చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications












