
హైదరాబాద్: ప్రత్యర్థి పేస్ ముందు ఎదురునిలువలేకపోయిన భారత జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. గత రెండు టెస్టులకు ఏమాత్రం సరిపోని ప్రదర్శనతో టీమిండియా బోల్తా పడింది. ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో నెగ్గిన ఇంగ్లండ్ ఐదు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మూడున్నర రోజుల్లోనే ముగిసిన ఈ టెస్ట్‌లో కోహ్లీసేన చెత్త బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. అయితే ఈ ఘోరపరాజయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ అసమర్థత వల్లనే ఈ ఘోర పరాజయం ఎదురైందని కామెంట్ చేస్తున్నారు. చివరకు వివాదాస్పద నటి శ్రీరెడ్డి సైతం భారత జట్టు ఘోర ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
పీవీ సింధుకి 'మెగా' సన్మానం: హాజరైన సినీ ప్రముఖులు (ఫోటోలు)
అంతేకాకుండా టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించాలని, సారథిగా విరాట్ కోహ్లీ పనికిరాడని ఘాటు వ్యాఖ్యలు చేసింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ట్విటర్ వేదికగా స్పందించిన ఆమె.. విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కోహ్లీ ఓ చెత్త ఆటగాడని, అతని బ్యాటింగ్ పరమ చెత్తగా ఉందని, రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చిందని కామెంట్ చేసింది. అంతేకాకుండా కోహ్లీ చెత్త పరమ చెత్త ఆటగాడు అంటూ తన ఆగ్రహాన్ని వెల్లగక్కింది.
ఇక శ్రీరెడ్డి అభిప్రాయాన్ని విభేదిస్తూ కోహ్లీ అభిమానులకు రంగంలో దిగగా.. వారికి కూడా ఆమె ధీటుగా బదులిచ్చింది. లార్డ్స్ టెస్ట్ విజయంలో కోహ్లీ పాత్ర లేదా? అని ఓ అభిమాని ప్రశ్నించగా.. ఏం లేదని, ఇతరుల క్రెడిట్ కోహ్లీ తీసుకున్నాడని చెప్పింది. ఇక శ్రీరెడ్డి అభిప్రాయంతో రోహిత్ శర్మ అభిమానులు ఏకీభవిస్తున్నారు. హిట్‌మ్యాన్‌కు సారథ్య బాథ్యతలు ఇవ్వాలని చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీరెడ్డి ట్వీట్లు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
కోహ్లీ అభిమానులు మాత్రం శ్రీరెడ్డిపై దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు క్రికెట్ గురించి నీకేం తెలుసని ప్రశ్నిస్తున్నారు. సినీ, రాజకీయాల జోలికి వెళ్లే శ్రీరెడ్డి ఇప్పుడు తన దృష్టిని క్రికెట్ మీద మరల్చిందేందబ్బా? అని సాధారణ క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు. అయితే క్రికెట్‌కు సంబంధించి శ్రీరెడ్డి కామెంట్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో దిగ్గజ క్రికెటర్, సచిన్ టెండూల్కర్‌పై కూడా ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఓవర్‌నైట్ స్కోరు 215/2తో నాలుగో రోజు శనివారం ఆట కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 99.3 ఓవర్లలో 278 పరుగుల వద్ద ఆలౌటైంది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రాబిన్సన్ (5/65), ఓవర్టన్ (3/47) భారత్ ఇన్నింగ్స్‌ను కూల్చేశారు. చేతిలో 8 వికెట్లున్న భారత్ నాలుగో రోజు ఉదయం సెషన్‌లో ఇరవై ఓవర్లయినా పూర్తిగా ఆడలేకపోయింది. ఓవర్‌నైట్ స్కోరుకు కేవలం 63 పరుగులు జతచేసి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయింది. సెప్టెంబర్ 2 నుంచి ఓవల్‌లో నాలుగో టెస్టు జరుగుతుంది.