For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Sri Lanka vs India: ఫలించిన లంక బోర్డు బెదిరింపులు.. 30లో 29 మంది గ్రీన్ సిగ్నల్! ఆ ఒక్కరు ఎవరంటే?

Sri Lankan cricket board confirms 29 players out of 30 have signed contract ahead India series

కొలంబో: జాతీయ కాంట్రాక్ట్‌ ఒప్పందాల విషయమై శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) బెదిరింపులు ఫలించాయి. మొత్తం 30 మందిలో 29 మంది లంక ఆటగాళ్లు కాంట్రాక్ట్‌ ఒప్పందాలపై సంతకం చేశారు. ఈ విషయాన్ని ఎస్‌ఎల్‌సీ స్వయంగా ధ్రువీకరించింది. కాంట్రాక్ట్‌ ఒప్పందాలపై సంతకం చేసేందుకు ఎస్‌ఎల్‌సీ 36 గంటల సమయం (జూలై 8) ఇవ్వగా.. ఒక రోజు ముందే లంక ప్లేయర్స్ దిగొచ్చారు. దీంతో బోర్డు అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఒక ప్లేయర్ మాత్రం ఒప్పందంపై సంతకం చేయలేదు. అతడే సీనియర్ ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్.

కాంట్రాక్ట్‌ వివాదం

కాంట్రాక్ట్‌ వివాదం

శ్రీలంక క్రికెట్ బోర్డు, ఆ దేశ ఆటగాళ్ల మధ్య జాతీయ కాంట్రాక్ట్‌కి సంబంధించి గత కొన్నిరోజులుగా వివాదం నడుస్తోంది. ఇటీవల కొన్ని విదేశీ పర్యటనల ముందు కూడా ఆటగాళ్లు కాంట్రాక్ట్‌ విషయమై బోర్డుపై అసహనం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ పర్యటన ముందు వెళ్లేదిలేదని చెప్పారు. రాజీ కుదరండంతో బంగ్లా, ఇంగ్లండ్ పర్యటనలను పూర్తిచేశారు.

ఇక భారత్‌తో సిరీస్‌కి ముందు కాంట్రాక్ట్‌పై సంతకం చేసేందుకు లంక క్రికెటర్లు విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార, అషేన్ బండార, కసున్ రజిత, లసిత్ ఎంబుల్‌దెనియా నిరాకరించారు. నేషనల్ కాంట్రాక్ట్‌ నిమిత్తం మొత్తం 30 మంది క్రికెటర్లకి ఎస్‌ఎల్‌సీ ఆఫర్ చేయగా.. ఈ ఐదుగురు మాత్రం తాము సంతకం చేయమని బోర్డుకు స్పష్టం చేశారు.

29 మంది ఒకే

29 మంది ఒకే

ఇంగ్లండ్ పర్యటనలో ఉండగానే కాంట్రాక్ట్‌కి సంబంధించి పత్రాలు ఆటగాళ్లకు పంపగా.. కీలక ఐదుగురు ప్లేయర్స్ మాత్రం సంతకం చేసేందుకు నిరాకరించారు. జూలై 13 నుంచి టీమిండియాతో సిరీస్ ఆరంభంకానున్న నేపథ్యంలో ఎస్‌ఎల్‌సీ తమ ఆటగాళ్లను హెచ్చరించింది. జాతీయ ఒప్పందాలపై సంతకం చేయడానికి జూలై 8 వరకు గడువు ఇచ్చింది. గడువులోగా లంక క్రికెటర్లు కాంట్రాక్ట్‌ ఒప్పందాలపై సంతకం చేయకుంటే.. టీమిండియాతో జరిగితే సిరీస్‌లకు ఎంపికచేయమని స్పష్టం చేసింది. దీంతో 29 మంది లంక ప్లేయర్స్ ఒకరోజు ముందుగానే ఒప్పందాలపై సంతకం చేశారు.

Happy Birthday MS Dhoni:'ఎంఎస్ ధోనీ' వేరే లెవెల్.. ఐసీసీ టైటిళ్లన్నీ గెలిచాడు! టాప్ రికార్డ్స్ ఇవే!

మాథ్యూస్ మాత్రం

మాథ్యూస్ మాత్రం

సీనియర్ ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్ మాత్రం జాతీయ కాంట్రాక్ట్‌కి సంబంధించిన పత్రంపై సంతకం చేయలేదు. అందుకు కారణం ఉంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను రిటైర్ కావాలనుకుంటున్నట్టు మాథ్యూస్ శ్రీలంక క్రికెట్ బోర్డుకు తెలియజేశాడట. అందుకే అతడు ఒప్పందం కుదుర్చుకోలేదు. మాథ్యూస్ రిటర్మెంట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. 34 ఏళ్ల మాథ్యూస్ ళనకే తరఫున 90 టెస్టులు, 218 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. జూలై 13 నుంచి భారత్-శ్రీలంక మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న లంక జట్టు మనగలవారం కొలంబో చేరుకుంది.

ఆందోళనలో లంక ప్లేయర్స్

ఆందోళనలో లంక ప్లేయర్స్

ఇంగ్లండ్ పర్యటన ముగించుకొని శ్రీలంకకు తిరిగొచ్చిన లంక ఆటగాళ్లు మంగళవారం ఇళ్లకు వెళ్లకుండా బయోబుడగలోకే ప్రవేశించారు. మరో వారంలో టీమిండియాతో పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడనున్న నేపథ్యంలో వారికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆదివారం ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో ఆడిన శ్రీలంక ప్రస్తుతం ఆందోళనలో ఉంది.

తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఇంగ్లండ్‌ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు, నలుగురు సహాయక సిబ్బంది వైరస్‌ సోకింది. భారత్, శ్రీలంక జట్ల మధ్య జూలై 13, 16, 19 తేదీల్లో వరుసగా మూడు వన్డేలు జరగనుండగా.. జూలై 22, 24, 27 తేదీల్లో మూడు టీ20ల సిరీస్ జరగనుంది.

Story first published: Wednesday, July 7, 2021, 18:37 [IST]
Other articles published on Jul 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+