For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Happy Birthday MS Dhoni:'ఎంఎస్ ధోనీ' వేరే లెవెల్.. ఐసీసీ టైటిళ్లన్నీ గెలిచాడు! టాప్ రికార్డ్స్ ఇవే!

MS Dhoni Birthday: Top Records, List of Achievements And ICC Trophies Won

హైదరాబాద్: 2004లో ఎంఎస్ ధోనీని చూసి.. ఇండియ‌న్ క్రికెట్‌నే మ‌లుపు తిప్పే మొనగాడు వచ్చాడని ఎవ‌రూ గుర్తించ‌లేక‌పోయారు. వికెట్ కీప‌ర్ల కొర‌త తీవ్రంగా వేధిస్తున్న స‌మ‌యంలో జుల‌పాల జుట్టుతో జట్టులోకి వ‌చ్చిన ధోనీ.. ఆ ఒక్క పాత్ర‌ను సమర్ధవంతంగా పోషిస్తే చాలనుకున్నారు. కానీ మంచి వికెట్ కీపింగ్ నైపుణ్యంతో పాటు దూకుడైన ఆట‌తో జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు.

త‌ర్వాతి కాలంలో కెప్టెన్‌గా అనుకోకుండా వ‌చ్చిన అవ‌కాశాన్ని నిల‌బెట్టుకోవ‌డ‌మే కాదు.. ఇండియ‌న్ టీమ్ మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచాడు. బుధ‌వారం ఎంఎస్ ధోనీ 40వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ నేప‌థ్యంలో మహీకి సంబందించిన కొన్ని రికార్డులను చూద్దాం.

ఐసీసీ టైటిళ్లన్నీ గెలిచిన ఏకైక సారథి

ఐసీసీ టైటిళ్లన్నీ గెలిచిన ఏకైక సారథి

క్రికెట్ ప్రపంచంలోనే తనదైన సారథ్యంతో గొప్ప కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ఎంఎస్ ధోనీ.. ఎవరికీ సాధ్యం కానీ అరుదైన ఘనతను తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. యువ క్రికెటర్‌గానే 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన మహీ.. మూడు దశాబ్దాలుగా ఊరించిన ప్రపంచకప్‌ను 2011లో అందించి యావత్ భారతం ఉప్పొంగేలా చేశాడు. అనంతరం 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచి.. ఐసీసీ టైటిళ్లన్నీ గెలిచిన ఏకైక సారథిగా చరిత్రకెక్కాడు. మేమాహేమీలకు సాధ్యంకానీ ఆ రికార్డు ఇప్పటికీ అలానే ఉంది.

అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం

అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం

క్రికెట్ చరిత్రలోనే అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఘనతను ఎమ్మెస్ ధోనీ అందుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 332 మ్యాచ్‌లకు మహీ కెప్టెన్సీ వహించాడు. ధోనీ తర్వాతి స్థానంలో ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ (324 మ్యాచ్‌లు) ఉన్నాడు. 60 టెస్టుల్లో ఒక జట్టుకు నాయకత్వం వహించిన ఏకైక వికెట్ కీపర్ కూడా. టెస్ట్ కెప్టెన్‌గా 3454 పరుగులు చేశాడు. ఇది వికెట్ కీపర్ కెప్టెన్లలో అత్యధికం. టెస్ట్ ఇన్నింగ్స్‌లో ఆరు క్యాచ్‌లు అందుకున్న తొలి భారతీయుడు. టెస్టులో అత్యధిక క్యాచ్‌లు (256) అందుకున్న టీమిండియా ప్లేయర్ కూడా.

అత్యధిక విజయాలు

అత్యధిక విజయాలు

టీమిండియాకు అత్యధిక విజయాలందించిన కెప్టెన్ ఎంఎస్ ధోనీనే. మూడు ఫార్మాట్లలో కలిపి 332 మ్యాచ్‌ల్లో 178 విజయాలందించాడు. ఇక అంతేకాకుండా భారత క్రికెట్ చరిత్రలోనే అత్యధిక వన్డేలకు సారథ్యం వహించిన ఘనతను అందుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో వికెట్ కీపర్ల జాబితాలో ధోనీదే వ్యక్తిగత హయ్యెస్ట్ స్కోర్. 2005లో శ్రీలంకపై 145 బంతుల్లో 15 ఫోర్లు, 10 సిక్సర్లతో 183 పరుగులు చేశాడు.

ఫలితంగా అప్పటి వరకు ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరిట ఉన్న రికార్డు బద్దలయింది. క్రికెట్ చరిత్రలోనే సిక్సర్‌తో ప్రపంచకప్ అందించిన ఏకైక ఆటగాడు ధోనీనే కావడం విశేషం. శ్రీలంకతో జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్లో ఆ జట్టు బౌలర్ నువాన్ కులశేఖర్ వేసిన మూడో బంతిని ధోనీ సిక్స్‌గా మలిచి 28 ఏళ్ల భారత కలను సాకారం చేశాడు.

HBD MS Dhoni: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినా.. తగ్గేదేలే! ధోనీ ఆదాయం ఎంతో తెలుసా?

వికెట్ కీపర్‌గా చరిత్ర

వికెట్ కీపర్‌గా చరిత్ర

మూడు ఫార్మాట్లో కలిపి 538 మ్యాచ్‌ల్లో కీపింగ్ చేసిన ఎంఎస్ ధోనీ 195 స్టంపౌట్లతో ఈ ఘనతనందుకున్న వికెట్ కీపర్‌గా చరిత్రకెక్కాడు. ధోనీ తర్వాత కుమార సంగక్కర (594 మ్యాచ్‌లు..139 స్టంపౌట్లు) ఉన్నాడు. మొత్తం 829 ఔట్లలో పాలుపంచుకున్న మహీ.. వరల్డ్ బెస్ట్ కీపర్లలో ఒకడిగా ఇండియా బెస్ట్‌గా నిలిచాడు.

ఇందులో 195 స్టంపౌట్లు, 634 క్యాచ్‌లు ఉన్నాయి. మరే భారత వికెట్ కీపర్ కనీసం 500 ఔట్ల మార్క్‌ను కూడా అందుకోలేకపోయారు. ధోనీ కీపింగ్ సగటు.. 1.363. వన్డేల్లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా ధోనీ ఘనతను అందుకున్నాడు. 200 వన్డేల్లో 53.56 సగటులో 6641 పరుగులు చేశాడు. ఇక ఓవరాల్‌గా ఈ జాబితాలో రికీ పాంటింగ్ ముందుండగా... ధోనీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఐపీఎల్‌లోనూ మహీ హవా

ఐపీఎల్‌లోనూ మహీ హవా

టీమిండియాకు ఎక్కువసార్లు భాగస్వామ్యాలు అందించిన ఘనత కూడా మహీదే. విరాట్ కోహ్లీతో 15, యువరాజ్ సింగ్‌తో 12, సురేష్ రైనాతో 11 (మరోసారి 10), రవీంద్ర జడేజాతో 9 సార్లు అత్యధిక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఈ జాబితాలో సచిన్, ద్రవిడ్ (11 సార్లు) నాలుగో స్థానంలో ఉన్నారు. ఐపీఎల్‌లోనూ మహీ హవా కొనసాగింది. అతని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ మూడు టైటిల్స్ అందుకుంది. చాంపియన్స్ లీగ్‌లోరెండు సార్లు విజేతగా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక విజయాలందించిన కెప్టెన్‌గానూ ధోనీకి రికార్డు ఉంది.

Story first published: Wednesday, July 7, 2021, 15:14 [IST]
Other articles published on Jul 7, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+