For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs sri lanka:నో శాంసన్.. బర్త్ డే బాయ్ ఇషాన్, సూర్య అరంగేట్రం.. శ్రీలంకదే బ్యాటింగ్

Sri Lanka Won The Toss And Opts To Bat; India And Sri Lanka Playing XI Is Out
Ind vs sl : Teamindia has some unique records vs srilanka Performnce | Oneindia Telugu

కొలంబో: భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ వికెట్‌పై ముందుగా బ్యాటింగ్ చేయడమే ఉత్తమమని చరిత్ర చెబుతుందని శ్రీలంక కెప్టెన్ డసన్ షనక అన్నాడు. తమ జట్టు తరఫున భానుక రాజపక్స అరంగేట్రం చేస్తున్నాడని తెలిపాడు. ఇక టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్‌ తీసుకోవాలనుకున్నామని భారత కెప్టెన్ శిఖర్ ధావన్ అన్నాడు.

డ్యూ ప్రభావం కీలకం కానున్న నేపథ్యంలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు అడ్వాంటేజ్ ఉంటుందన్నాడు. తనతో కలిసి పృథ్వీ షా ఓపెనింగ్ చేస్తాడని, బర్త్‌డే బాయ్ ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లు వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేస్తున్నారని తెలిపాడు. కుల్దీప్, యుజ్వేంద్ర చాహల్‌‌ స్పిన్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నామన్నాడు.

ఊహించనట్లుగానే సంజూ శాంసన్‌కు మొండిచేయ్యే ఎదురైంది. అతను కాలిగాయంతో బాధపుడుతున్నాడని, అందుకే సెలెక్ట్ చేయలేదని టీమ్ వర్గాలు పేర్కొన్నాయి. ఎప్పటికప్పుడూ మెడికల్ టీమ్ అతని గాయం పురోగతిని పరిశీలిస్తున్నాయని తెలిపాయి. ఇక ముందుగా ఊహించినట్లే కృనాల్ పాండ్యా, దీపక్ చాహర్‌కు అవకాశం దక్కింది. చాలా కాలం తర్వాత కుల్చా జోడీ బరిలోకి దిగుతోంది.

టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో రెండు జట్లు ఈ సిరీస్‌కు చాలా ప్రాధాన్యమిస్తున్నాయి. సిరీస్ గెలిచి కాన్ఫిడెన్స్‌ను పెంచుకోవాలని టార్గెట్‌గా పెట్టుకున్నాయి. అయితే ఇరు జట్లలో కుర్రాళ్లు మంచి జోరు మీదుంటం, కొత్త కెప్టెన్లుగా శిఖర్ ధావన్.. షనక టీమ్స్‌ను ఎలా నడిపిస్తారన్న ఆసక్తి అందరిలో మొదలైంది.

తుది జట్లు
భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, మనీశ్ పాండే, ఇషాన్ కిషన్(కీపర్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్

శ్రీలంక :
అవిష్కా ఫెర్నాండే, మినోద్ భానుక(కీపర్), భానుక రాజపక్స, ధనుంజయ డిసిల్వా, చరిత్ అసలంక, డసన్ షనక, వానిందు హసరంగ, చమిక కరుణరత్నే, ఇసురు ఉడానా, దుశ్మంతా చమీరా, లక్షణ్ సందకన్

Story first published: Sunday, July 18, 2021, 15:06 [IST]
Other articles published on Jul 18, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+