
కొలంబో: శ్రీలంక-న్యూజిలాండ్ రెండో టెస్టుకు వర్షం ఆటంకం కలిగిస్తోంది. వర్షం కారణంగా మొదటి రోజు ఫస్ట్ సెషన్ తుడిచి పెట్టుకుపోగా.. రెండో రోజు కూడా ఇప్పటివరకు కేవలం 29 వర్ల ఆట మాత్రమే సాధ్యమయింది. కొలంబోలో వర్షం పడడంతో అంపర్లు ఆటను నిలిపివేశారు. ఆట నిలిచే సమయానికి లంక 66 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ట్రెంట్ బౌల్ట్, టీమ్ సౌథీ తలో రెండు వికెట్లు తీశారు. ప్రస్తుతం అక్కడ వర్షం ఎక్కువగా పడుతుండడంతో.. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. మ్యాచ్ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేవు.
లాక్మే ఫ్యాషన్ వీక్.. హార్దిక్ పాండ్యా ర్యాంప్ వాక్
తొలి రోజు ఆటకు వర్షం దెబ్బ పడింది. ఆట చాలా ఆలస్యంగా మొదలు కాగా.. రోజు మొత్తంలో 36.3 ఓవర్లే సాధ్యపడ్డాయి. గురువారం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక.. ఆట చివరకు 2 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. తిరిమానె (2)ను సోమర్‌విలీ, కుశాల్ మెండిస్ (32)ను గ్రాండ్‌హోమ్ పెవిలియన్ చేర్చారు. అనంతరం ఫామ్ కొనసాగించిన కెప్టెన్ కరుణరత్నె (49) పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా మాథ్యూస్ (0) క్రీజులో ఉన్నాడు.
రెండో రోజు ఆట మొదలయిన వెంటనే కరుణరత్నె అర్ధ సెంచరీ చేసాడు. మరోవైపు మాథ్యూస్ (2) 29 బంతులు ఆడినా.. పరుగులు చేయడంలో విఫలమయి జట్టు స్కోరు 93 వద్ద పెవిలియన్ చేరాడు. అదే స్కోర్ వద్ద కుషాల్ పెరీరా (0) కూడా ఔట్ అవ్వడంతో లంక కష్టాల్లో పడింది. అయితే కరుణరత్నె పోరాడడంతో లంక స్కోర్ ముందుకు నడిచింది. ఇక జట్టు స్కోర్ 130 వద్ద బౌల్ట్, సౌతీ చెలరేగడంతో కరుణరత్నె, డిక్వెల్లా వెనుదిరిగారు. ఈ దశలో పెరెరాతో కలిసి ధనుంజయ డిసిల్వా (32) జట్టును ఆదుకున్నాడు. ఈ సమయంలో వర్షం పడడంతో మ్యాచ్ ఆగిపోయింది. రెండు టెస్టుల సిరీస్ తొలి మ్యాచ్‌లో లంక విజయం సాధించిన సంగతి తెలిసిందే.